ATA Celebrations 2022: ఆటా మహాసభల కోసం అమెరికా చేరుకున్న టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఘన స్వాగతం పలికిన అభిమానులు..

ATA Celebrations 2022:అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ వేదికగా అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వందలాదిమంది కళాకారులతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల

ATA Celebrations 2022: ఆటా మహాసభల కోసం అమెరికా చేరుకున్న టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఘన స్వాగతం పలికిన అభిమానులు..
Ata Celebrations 2022
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Jul 04, 2022 | 11:07 AM

ATA Celebrations 2022: అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ వేదికగా అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వందలాదిమంది కళాకారులతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల సువిశాలమైన , అత్యంత సుందరమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ మహాసభలు జరగనున్నాయి. మరోవైపు ఆటా మహాసభల్లో పాల్గొనడానికి అతిరథ మహారథులు తరలివస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి తో పాటు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్ డీసీ ఎయిర్ పోర్టులో మంత్రులు , టీఆర్ఎస్ నేతలకు ఆటా నిర్వాహకులు, టీఆర్ఎస్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుండి భారీ కార్ల ర్యాలీతో మంత్రులు, ఆర్ ఎస్ నేతలు ఆటా- 17 వ మహాసభలు జరుగుతున్న వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌కు బయలుదేరి వెళ్లారు.

సినీ తారల సందడి..

కాగా వాషింగ్టన్‌ డీసీలోని సువిశాలమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌లో జులై 1, 2, 3 తేదీల్లో ఈ మెగా కన్వెన్షన్‌ నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఆటా సంబరాల్లో హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్ , శ్రీలీల, ఫరియా అబ్దుల్లా , సింగర్ సునీత, మంగ్లీ, రామ్ మిర్యాల, ఎస్‌ ఎస్‌ థమన్‌ తమ ఆటపాటలతో అలరించనున్నారు. ఇక ఇదే మహాసభల్లో బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించనున్నారు. ప్రతిష్టాత్మకంగా ఆటా నిర్వహించే ఈ వేడుకలు ఈ సంవత్సరం మరింత పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. వందలాదిగా వలంటీర్లు వివిధ ఏర్పాట్ల కోసం 80 కమిటీలుగా ఏర్పడి శ్రమిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు