Zuckerberg: కేజ్‌ఫైట్‌ను మస్క్ సీరియస్‌గా తీసుకోవడం లేదన్న జూకర్ బర్గ్.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే
ఎలాన్ మస్క్, జూకర్ బర్గ్ మధ్య కేజ్ మ్యాచ్ జరుగుతుందని ఇటీవల జోరుగా ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, జూకర్ బర్గ్ మరోసారి మ్యాచ్‌కు సంబంధించిన విషయంపై ఆన్‌లైన్‌లో ఛాట్ చేసుకున్నారు. అసలు ఎలాన్ మాస్క్ తన కేజ్‌ఫైట్‌కు డేట్లు ఇవ్వడం లేదని జూకర్ బర్గ్ ఆరోపించారు. దీంతో మస్క్ తన ఇంటి తలుపు తట్టడానికి రేపటి వరకు వేచి చూడలేనంటూ స్పందించారు. ఇక వాళ్లు మాట్లాడుకున్న విషయాల్ని గమనిస్తే.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తనతో కేజ్ ఫైట్‌ను తేలికగా తీసుకున్నారని జూకర్ బర్గ్ అన్నారు.

ఎలాన్ మస్క్, జూకర్ బర్గ్ మధ్య కేజ్ మ్యాచ్ జరుగుతుందని ఇటీవల జోరుగా ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, జూకర్ బర్గ్ మరోసారి మ్యాచ్‌కు సంబంధించిన విషయంపై ఆన్‌లైన్‌లో ఛాట్ చేసుకున్నారు. అసలు ఎలాన్ మాస్క్ తన కేజ్‌ఫైట్‌కు డేట్లు ఇవ్వడం లేదని జూకర్ బర్గ్ ఆరోపించారు. దీంతో మస్క్ తన ఇంటి తలుపు తట్టడానికి రేపటి వరకు వేచి చూడలేనంటూ స్పందించారు. ఇక వాళ్లు మాట్లాడుకున్న విషయాల్ని గమనిస్తే.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తనతో కేజ్ ఫైట్‌ను తేలికగా తీసుకున్నారని జూకర్ బర్గ్ అన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితోనే వదిలేస్తానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా థ్రెడ్స్‌లో ఈ మేరకు పోస్టు పెట్టారు. ఎలాన్ మస్క్ గంభీరంగా తీసుకోవండ లేదు.. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారని అనుకుంటున్నానని చెప్పారు. అయితే తాను ఇప్పటికే మస్క్‌కు డేట్ కూడా సూచించానని పేర్కొన్నారు.
అలాగే డాన వైట్ ఈ కేజ్ ఫైట్ పోటీని చట్టబద్ధం చేయడానికి అంగీకరించారని.. కానీ ఎలాన్ మస్క్ మాత్రం ఇప్పటిదాకా డేట్‌ను ఎంపిక చేయలేదని చెప్పారు. తనకు శస్త్రచికిత్స అవసరమని చెబుతున్నాడని.. అలాగే ఇప్పుడేమో తన ఇంటి పెరట్లో ఓ ప్రాక్టీస్ రౌండ్ ఆడదామని అంటున్నాడని పేర్కొన్నారు. అలాగే మస్క్ అధికారిక ఈవెంట్‌ను సీరియస్‌గా తీసుకొని తేదీని అనుకుంటే నన్ను ఎలా సంప్రదించాలో అతనికి తెలుసని అన్నారు. లేకపోతే తాను తప్పుకుంటానని అన్నారు. ఇంకా మరెవరితోనైనా పోటీపడటంపై దృష్టిపెడతానని జూకర్ బర్గ్ అన్నారు. అయితే ఆయన చేసిన ఈ పోస్టును ఓ నెటీజన్ ఎలాన్ మస్క్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మస్క్ దీనిపై స్పందించారు. తాను సోమవారం సిలికాన్ వ్యాలీకి వెళ్తానని.. తన ఇంటి తలుపు తట్టేందుకు వేచి ఉండలేనని అన్నారు. అలాగే జూకర్ బర్గ్‌ను పందెం కోడితో పోలుస్తూ.. జూక్ ఈజ్ ఏ చికెన్ అని అన్నారు.
అతడు అమెరికాలోని ప్రముఖ రెస్టారెంట్ చిక్ ఫిల్‌కు వెళ్లి చికెన్ తినలేడని.. ఎందుకంటే తన జాతిని తానే తిన్నట్లవుతుందని సరదాగా అన్నారు. ఇదిలా ఉండగా మరో విషయం ఏంటంటే వాస్తవానికి ఈ టెక్ దిగ్గజాల మధ్య కేజీ ఫైట్ పోటీని ఇటలీలో నిర్వహించనున్నట్లు కొన్నాళ్ల క్రితం ఎలాన్ మస్క్ స్వయంగా పేర్కొన్నారు. ఈ ఫైట్, వేదికకు సంబంధించి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. ఈ పోరును తాను, జూకర్ బర్గ్ ఫౌండేషన్లు నిర్వహిస్తాయని చెప్పారు. అలాగే ఈ మ్యాచ్ ఎక్స్‌తో సహా మెటాలలో కూడా ఇందుకు సంబంధించిన కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుందని చెప్పారు. అయితే ఏ తేదిన ఈ పోరు ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆగస్టు 26న నిర్వహించేందుకు సిద్దమని జూకర్ అన్నప్పటికీ మస్క్ నుంచి మాత్రం దీనిపై సమాధానం రాలేదు.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం