AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 నిమిషాల్లోనే 15 వేల అడుగుల కింద‌కు దిగిన విమానం.. భయాందోళనలో ప్రయాణికులు.. అస‌లేం జ‌రిగిందంటే..?

మార్గ‌మ‌ధ్య‌లో 29 వేల అడుగుల ఎత్తులో ఉండ‌గా విమానంలో పీడ‌న స‌మ‌స్య త‌లెత్తింది. దీన్ని గుర్తించిన సిబ్బంది చకచక్యంగా వ్యవహరించారు. వెంట‌నే మాస్కుల ద్వారా ప్ర‌యాణికుల‌కు ఆక్సిజ‌న్ అంద‌జేశారు. విమానాన్ని వీలైనంత త్వ‌ర‌గా కింద‌కు దించి, త‌క్కువ ఎత్తులో న‌డ‌పాల‌ని పైల‌ట్లు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో విమానాన్ని కేవ‌లం 6 నిమిషాల్లోపే 18,600 అడుగుల కింద‌కు దించారు.

3 నిమిషాల్లోనే 15 వేల అడుగుల కింద‌కు దిగిన విమానం.. భయాందోళనలో ప్రయాణికులు.. అస‌లేం జ‌రిగిందంటే..?
Airlines
Jyothi Gadda
|

Updated on: Aug 14, 2023 | 10:08 PM

Share

ఆకాశంలో ఎగురుతున్న.. విమానం మూడు నిమిషాల్లో 15 వేల అడుగుల కిందికి దిగిన షాకింగ్ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరిక‌న్ ఎయిర్‌లైన్స్ విమానం కేవ‌లం 3 నిమిషాల వ్య‌వ‌ధిలోనే 15 వేల అడుగులు కింద‌కు దిగింది. దీంతో విమానంలోని ప్ర‌యాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 5916 షార్లెట్, నార్త్ కరోలినా, USA నుండి ఫ్లోరిడాలోని గైనెస్‌విల్లేకు బయలుదేరింది. అంతలోనే ఎవరూ ఊహించని విధంగా ఈ భయానక సంఘటన చోటు చేసుకుంది. విమానంలో ఉన్న ప్రయాణికులకు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని అయోమయంలో… ఊపిరి బిగ‌ప‌ట్టుకుని బిక్కుబిక్కు మంటూ గడిపారు. చివ‌ర‌కు విమానం సుర‌క్షితంగా ల్యాండ్ కావ‌డంతో ప్ర‌యాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విమానం ఎత్తుకు ఎగిరిన తర్వాత విమానంలో పీడ‌నానికి సంబంధించిన స‌మ‌స్య త‌లెత్త‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని విమాన‌యాన సంస్థ స్ప‌ష్టం చేసింది.

అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 5916 ఉత్త‌ర క‌రోలినాలోని షార్లెట్ నుంచి ఫ్లోరిడాలోని గెయిన్జ్‌ విల్‌కు టేకాఫ్ తీసుకుంది. కానీ, మార్గ‌మ‌ధ్య‌లో 29 వేల అడుగుల ఎత్తులో ఉండ‌గా విమానంలో పీడ‌న స‌మ‌స్య త‌లెత్తింది. దీన్ని గుర్తించిన సిబ్బంది చకచక్యంగా వ్యవహరించారు. వెంట‌నే మాస్కుల ద్వారా ప్ర‌యాణికుల‌కు ఆక్సిజ‌న్ అంద‌జేశారు. విమానాన్ని వీలైనంత త్వ‌ర‌గా కింద‌కు దించి, త‌క్కువ ఎత్తులో న‌డ‌పాల‌ని పైల‌ట్లు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో విమానాన్ని కేవ‌లం 6 నిమిషాల్లోపే 18,600 అడుగుల కింద‌కు దించారు.

ఇవి కూడా చదవండి

ఈ సంద‌ర్భంగా విమానంలో ప్ర‌యాణించిన ఫ్లోరిడా యూనివ‌ర్సిటీకి చెందిన ప్రొఫెస‌ర్ హ‌రిస‌న్ హోవ్ త‌న అనుభ‌వాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకుకున్నారు. తాను చాలా సార్లు విమానంలో ప్ర‌యాణించానని చెప్పారు. కానీ, ఇలాంటి భ‌యాన‌క అనుభ‌వాన్ని ఎదుర్కొవటం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు.

విమాన ప్రయాణికులు ఏదైనా అసౌకర్యానికి గురైనట్టయితే,..మా కస్టమర్లకు మేము క్షమాపణలు కోరింది అమెరికన్ ఎయిర్‌లెన్స్‌. తమ సిబ్బంది వృత్తి నైపుణ్యానికి మా బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
HDMIకి పోటీగా GPMI వచ్చేసింది! వీడియో, డేటా, పవర్ అన్నీ ఒకేదానిలో
HDMIకి పోటీగా GPMI వచ్చేసింది! వీడియో, డేటా, పవర్ అన్నీ ఒకేదానిలో
విదేశాంగ మంత్రిత్వ శాఖలో MEA ఇంటర్న్‌షిప్‌.. డిగ్రీ పాసైతే చాలు!
విదేశాంగ మంత్రిత్వ శాఖలో MEA ఇంటర్న్‌షిప్‌.. డిగ్రీ పాసైతే చాలు!
పొరపాటున నిమ్మ గింజ మింగేశారా? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే
పొరపాటున నిమ్మ గింజ మింగేశారా? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే
వేడి వేడి సాంబార్‌లో పడి మహిళ మృతి..!
వేడి వేడి సాంబార్‌లో పడి మహిళ మృతి..!
5 సీట్ల ఆల్టోను 7 సీట్ల జీప్‌గా మార్చేశాడు.. మెకానిక్ క్రియేటివిట
5 సీట్ల ఆల్టోను 7 సీట్ల జీప్‌గా మార్చేశాడు.. మెకానిక్ క్రియేటివిట
తినడానికి తిండి లేని రోజులు.. పక్కింట్లో అన్నం కోసం చూశా..
తినడానికి తిండి లేని రోజులు.. పక్కింట్లో అన్నం కోసం చూశా..
ఓయో హోటల్‌కు వచ్చి విగతజీవిగా మారిన యువతి!
ఓయో హోటల్‌కు వచ్చి విగతజీవిగా మారిన యువతి!
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి