Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి.. అధికారిక లెక్కల కన్నా కోవిడ్ మ‌ర‌ణాలు మూడు రెట్లు ఎక్కువ: WHO

World Health Organization:కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఫస్ట్‌ వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో మరింతగా వ్యాప్తి చెందుతోంది. పాజిటివ్‌ కేసులు, మరణాలు భారీగా..

ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి.. అధికారిక లెక్కల కన్నా కోవిడ్ మ‌ర‌ణాలు మూడు రెట్లు ఎక్కువ: WHO
Follow us
Subhash Goud

|

Updated on: May 21, 2021 | 10:00 PM

World Health Organization:కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఫస్ట్‌ వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో మరింతగా వ్యాప్తి చెందుతోంది. పాజిటివ్‌ కేసులు, మరణాలు భారీగా నమోదు కావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రపంచ దేశాలను సైతం పట్టి పీడిస్తున్న కరోనా.. కొన్ని కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ మహమ్మారి వల్ల గత ఏడాది కాలంలో లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. అమెరికాకు చెందిన జాన్స్‌ హాప్కిన్స్‌ కోవిడ్‌ డేటా ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 35 లక్షల మంది మరణించారు. సుమారు 17 కోట్ల మందికి వైరస్‌ సంక్రమించింది. అమెరికాలో 33.0 లక్షల మందికి వైరస్‌ సోకగా, 5.88 లక్షల మంది మరణించారు. ఇక భారత్‌లో 26 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2.90 లక్షల మంది మరణించారు. బ్రెజిల్‌లో కూడా మరణాల సంఖ్య భారీగానే ఉంది. బ్రెజిల్‌లో 15 లక్షల మంది వైరస్‌ బారిన పడగా, అందులో 4.41 లక్షల మంది మృతి చెందారు.

అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈరోజు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల సంభవించిన మరణాల సంఖ్య అధికారిక లెక్కల కన్నా మూడు రెట్లు అధికంగా ఉంటుందని పేర్కొంది. అనేక ప్రపంచ దేశాలు ఇంకా ఈ మహమ్మారిపై పోరాటం చేస్తూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే .. మరో వైపు పాజిటివ్‌ కేసులు, మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.

ఇవీ చదవండి:

Oxygen: మీ మొబైల్‌లోనే ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవచ్చు.. యాప్‌కు రూపకల్పన చేసిన కోల్‌కతాకు చెందిన అంకుర సంస్థ

నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయాలి: ఆయూష్‌, ఐసీఎంఆర్‌కు సూచించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌పై కేంద్రం కీలక ప్రకటన.. అంటు వ్యాధిగా గుర్తించాలంటూ రాష్ట్రాలకు లేఖ.. కీలక సూచనలు

Heart Pain: గుండెనొప్పి వచ్చిన వారికి మొదటి గంట సమయమే ముఖ్యం.. లేదంటే మరణానికి చేరువయ్యే అవకాశాలు ఎక్కువ..!