AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chopstick Pieces: అక్కాచెల్లెళ్ల కొట్లాట.. ముక్కుల్లో కర్ర ముక్కలు ఇరుక్కుపోయిన వైనం..వారం తర్వాత గుర్తింపు

Chopstick Pieces: కళ్ళు, ముక్కు చెవి.. ఇలా ఏ అవయాల్లోనైనా చిన్నపాటి ఇబ్బందులు ఎదురైతే.. అది భరించలేక వెంటనే డాక్టర్ వద్దకు పరిగెడతాం.. అయితే ఓ మహిళ ముక్కులో..

Chopstick Pieces: అక్కాచెల్లెళ్ల కొట్లాట.. ముక్కుల్లో కర్ర ముక్కలు ఇరుక్కుపోయిన వైనం..వారం తర్వాత గుర్తింపు
Chopstick Pieces
TV9 Telugu Digital Desk
| Edited By: Surya Kala|

Updated on: Jul 09, 2021 | 9:26 PM

Share

Chopstick Pieces: కళ్ళు, ముక్కు చెవి.. ఇలా ఏ అవయాల్లోనైనా చిన్నపాటి ఇబ్బందులు ఎదురైతే.. అది భరించలేక వెంటనే డాక్టర్ వద్దకు పరిగెడతాం.. అయితే ఓ మహిళ ముక్కులో ఏకంగా రెండు కర్రముక్కలున్నా .. ఆ విషయం తెలియక పోవడంతో ఏకంగా ఒక రోజులు వాటితో పాటు గడిపేసింది. వారం రోజుల అనంతరం ముక్కులో ఉన్నట్లు అనిపించడంతో అప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. ఆ మహిళను పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు.ఈ ఘటన తైవాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

తైవాన్ కు చెందిన 29 ఏళ్ల యువతి ముక్కులో ఎదో ఇబ్బందిగా ఉందని.. బ్రవున్ కలర్ లో ఏవో కనిపిస్తున్నాయంటూ.. ఆస్పత్రికి వెళ్ళింది. వైద్యుడి పరీక్షల్లో రెండు ముక్కు రంధ్రాల్లో రెండు కర్రముక్కలున్నాయని వైద్యులు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి.. వాటిని బయటకు తీశారు. ఇలా తన ముక్కులో కర్రలు ఇరుక్కోవడానికి కారణం తన చెల్లితో గొడవపడడమే అని చెప్పింది ఆ మహిళ. ఒక వారం రోజుల క్రితం అక్కా చెల్లిళ్లదరికీ వాగ్వాదం వచ్చి.. అది కొట్టుకునే స్టేజ్ కు వెళ్ళింది. దీంతో తమ చేతికి అందిన వస్తువులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే సమయంలో ఒక పాత్రకు ఉన్న కర్ర ముక్కలు బాధితురాలి ముక్కు రంధ్రాల్లోకి కర్ర ముక్కలు దూరిపోయాయి. ఆ విషయం బాధితురాలికి తెలియలేదు. అయితే అప్పుడు కళ్ళు ఉబ్బడం.. ముక్కు నుంచి రక్త రావడంతో.. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుంది. ఆమెకు ఎక్స్ రే తీసిన వైద్యులు ఎటువంటి తీవ్రమైన గాయాలు లేవని.. చికిత్సనందించి ఫరవాలేదని ఇంటికి పంపించారు.

ముక్కు కారటం , వాపు వంటి లక్షణాలను ఆమెను బాధించలేదు..తర్వాత రోజు రోజుకీ బాధితురాలి ముక్కులో ఎదో ఉన్న ఫీలింగ్.. కలగడంతో.. తన ముక్కుని అద్దం లో చూసుకుంది. అప్పుడు ముక్కు రంద్రాల్లో ఏవో చిక్కుకున్నట్లు గమనించింది.

మళ్ళీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళింది. డాక్టర్లు వెంటనే స్కాన్ చేసి ఆమె ముక్కులో కర్రముక్కలు ఉన్నాయని గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి.. ముక్కు రంధ్రాల నుంచి ఆ ముక్కలను బయటకు తీశారు. రోగి ముక్కులో చాప్ స్టిక్స్ ముక్కలు ఉన్నప్పటికీ ఆమె చర్మం పై కేవలం రెండు చిన్న చిన్న గీతలు మాత్రమే ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఇటువంటి అసాధారణ సంఘటనలు జరిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్పారు. అంతేకాదు ఎప్పుడైనా ఏదైనా వస్తువులు పుర్రె భాగంలోకి చేరితే దానివల్ల పెద్ద ఇబ్బంది కలగదు. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించడం చాలా మంచిదని సూచించారు. ఈ కేసు జూన్ 24 న ది జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ లో ప్రచురించబడింది.

Also Read: రోజు సూర్యరశ్మి తగలకుండా ఉంటున్నారా.. అయితే డి విటమిన్ లోపంతో.. అనేక వ్యాధులు వచ్చే అవకాశం