AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin D: రోజు సూర్యరశ్మి తగలకుండా ఉంటున్నారా.. అయితే డి విటమిన్ లోపంతో.. అనేక వ్యాధులు వచ్చే అవకాశం

Vitamin D Deficiency: ప్రస్తుత జనరేషన్ లో ఎండ వేడి తగలకుండా శరీరం కందకుండా జీవించడానికి ఇషపడుతున్నారు. కరోనా వచ్చిన తర్వాత ఎక్కువగా..

Vitamin D: రోజు సూర్యరశ్మి తగలకుండా ఉంటున్నారా.. అయితే డి విటమిన్ లోపంతో.. అనేక వ్యాధులు వచ్చే అవకాశం
Vitamin D
TV9 Telugu Digital Desk
| Edited By: Surya Kala|

Updated on: Jul 09, 2021 | 8:54 PM

Share

Vitamin D Deficiency: ప్రస్తుత జనరేషన్ లో ఎండ వేడి తగలకుండా శరీరం కందకుండా జీవించడానికి ఇషపడుతున్నారు. కరోనా వచ్చిన తర్వాత ఎక్కువగా వర్క్ ఎట్ హోమ్ ఇవ్వడంతో చాలామంది బయటకు వచ్చే సమయం.. ఆసక్తి లేకపోవడంతో సూర్య రశ్మికి దూరంగా జీవిస్తున్నారు. దీంతో ఎక్కువమంది డి విటమిన్ లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజానికి మనం ఆరోగ్యంగా ఉండడానికి అన్ని విమిటమిన్లు ఉండాల్సిందే.. ఏ విటమిన్ లోపం ఏర్పడినా.. ఇదొక వ్యాధికి గురికావాల్సిందే. అయితే సూర్యరశ్మి నుంచి లభించే విటమిన్ డి గురించి కరోనా సమయం నుంచి ఎక్కువగా వినిపిస్తుంది. నిజానికి విటమిన్ డి3 చర్మానికి సూర్యరశ్మి (​ముఖ్యముగా అతినీలలోహిత కిరణాలు) సోకినపుడు తయారుచేయబడుతుంది. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. విట‌మిన్ డి తో అనేక జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వర్తించ‌బ‌డ‌తాయి. ప్రస్తుతం ఎక్కువమంది విటమిన్ ‘డి’ లోపంతో బాధపడుతున్నారు. దీనికి కారణం రోజు రోజుకు ఎండకు దూరంగా జీవించడమే అని అంటున్నారు.

విటమిన్ డి తయారు కావడానికి రోజూ సూర్య రశ్మి శరీరానికి తగలాల్సిందే. లేదంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. విటమిన్ ‘డి’ లేకపోతే శరీరం కాల్షియంను శోషించుకోదు. ఈ క్రమంలో ఎముక‌లు గుల్లగా మారి పెళుసుగా మారిపోతాయి. బ‌ల‌హీనంగా త‌యార‌వుతాయి. దీంతో అవి విరిగిపోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ క్రమంలో కండ‌రాల బ‌ల‌హీన‌త‌, రికెట్స్, ఆస్టియోమ‌లేషియా, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. విట‌మిన్ డి లోపం ఏర్పడితే.. కాలివేళ్ల ఎముక‌ల్లో స‌మ‌స్యలు ఏర్పడతాయి. నొప్పులు వస్తాయి. విట‌మిన్ డి త‌గినంత ల‌భించ‌క‌పోవ‌డం వ‌ల్ల పెద్ద పేగు క్యాన్సర్ వ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉన్నాయి.

విట‌మిన్ డి త‌గినంత ల‌భించ‌క‌పోతే డిప్రెష‌న్ బారిన పడే అవకాశం ఉంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు ఏర్పడతాయి. సోరియాసిస్‌, మొటిమ‌లు వ‌స్తాయి. అధికంగా బ‌రువు పెరుగుతారు.

అందుకనే రోజూ సూర్య రశ్మి తగిలేలా కొంత సమయం గడపాలి. అప్పుడే విట‌మిన్ డి తయారై.. అనేక ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఇక గర్భవతిగా ఉన్న సమయంలో మహిళలు విటమిన్ డి ఎక్కువగా తీసుకొంటే పిల్లల్లో శారీరక సత్తా పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధనల్లో తేలింది. అందువల్లనే గర్భిణీలు చేపలను తినాలని.. అప్పుడు విటమిన్ డి లభిస్తుందని అంటున్నారు.

Also Read:   60 ఏళ్ల తర్వాత ఆర్ధిక భద్రత కోసం ఈ స్కీమ్..రోజుకు రూ.7 పొదుపుతో ఏడాదికి 60 వేలు పెన్షన్