Ankita Bose: తనపై తప్పుకు కథనాలు అంటూ రచయిత మహేష్ మూర్తిపై అంకితి బోస్ రూ. 820 కోట్లు పరువు నష్టం దావా.. ఇంతకీ అంకితి బోస్ ఎవరంటే?

రచయిత మహేష్ మూర్తి భారతదేశంలోని స్టార్టప్‌లకు సీడ్ ఫండ్‌లను అందించే కంపెనీలో మేనేజింగ్ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.

Ankita Bose: తనపై తప్పుకు కథనాలు అంటూ రచయిత మహేష్ మూర్తిపై అంకితి బోస్ రూ. 820 కోట్లు పరువు నష్టం దావా.. ఇంతకీ అంకితి బోస్ ఎవరంటే?
Ankita Bose
Follow us
Surya Kala

|

Updated on: Apr 24, 2023 | 9:34 AM

సింగపూర్‌కు చెందిన ఫ్యాషన్ టెక్ సంస్థ జిలింగో సహ వ్యవస్థాపకుడు అంకితి బోస్.. భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో మోసాల అంశంపై ఏంజెల్ ఇన్వెస్టర్ మహేష్ మూర్తిపై దావా వేశారు.  $100 మిలియన్ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ. 820 కోట్లు పరువు నష్టం దావా వేసినట్లు పేర్కొన్నారు. రూ. 820 కోట్ల నష్టపరిహారంతో పాటు మూర్తి నుండి క్షమాపణలు కోరింది. రచయిత మహేష్ మూర్తి భారతదేశంలోని స్టార్టప్‌లకు సీడ్ ఫండ్‌లను అందించే కంపెనీలో మేనేజింగ్ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. అంకితి బోస్ ఏప్రిల్ 20న దావా వేశారు. తనపై ఎలాంటి పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించకుండా మూర్తిని నిరోధించాలంటూ ఆమె నిషేధాన్ని కోరింది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు మీడియాలో ప్రసారం అవుతున్న ప్రత్యేక కథనాలు అన్నీ బోగస్ అన్నారు. ఆరోపణలు కల్పితమని మూర్తి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆమె స్పష్టం చేశారు. ఇంతకీ  అంకితి బోస్ ఎవరు? తెలుసుకుందాం..

31 ఏళ్ల అంకితి బోస్ ఈ-కామర్స్ స్టార్టప్ జిలింగో సహ వ్యవస్థాపకురాలు. ధృవ్ కపూర్‌తో కలిసి 2015లో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. కంపెనీ హోల్‌సేల్ కొనుగోలుదారులను విక్రేతలతో కలుపుతుంది. 2019లో వీరు  ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో ఉన్నారు. తమ కంపెనీతో 970 మిలియన్ డాలర్ల (రూ. 7957 కోట్లు) విలువతో 226 మిలియన్ డాలర్ల నిధులను సేకరించారు.

అంకితి బోస్ ముంబైలోని కేంబ్రిడ్జ్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుండి గణితం , ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించింది. మెకిన్సే అండ్  కంపెనీ,  సీక్వోయా క్యాపిటల్‌లో ఉద్యోగిగా కెరీర్ ను ప్రారంభించింది.  ఆగ్నేయాసియాలోని ఫ్యాషన్ మార్కెట్ రిటైలర్‌లు తమ వ్యాపారాలను ఆన్‌లైన్‌లో ఫైనాన్స్ చేయలేరని, స్కేల్-అప్ చేయలేరని అంకితి ఒక పర్యటనలో ఉండగా గమనించింది. అందుకే ఫ్యాషన్ మార్కెట్ తమ ప్రపంచ ప్రత్యర్ధులతో పోలిస్తే వెనుకబడి ఉన్నారని గుర్తించింది. ఆమె 23 సంవత్సరాల వయస్సులో స్టార్టప్‌ని ప్రారంభించడానికి అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. మరుసటి సంవత్సరం అంకితి సింగపూర్‌కు వెళ్లింది. ఈ-కామర్స్ స్టార్టప్ ప్రారంభించి సక్సెస్ బాట పట్టారు. 2019లో వారు 970 మిలియన్ డాలర్ల విలువను అందుకున్నారు.

అంకితి ఇండోనేషియాలోని మహిళల కోసం దుస్తులను తయారు చేసే డిజైనింగ్ కళలో శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతేకాదు దేశవ్యాప్తంగా కొత్త నాయకులను తయారు చేయడానికి,  మద్దతు ఇవ్వడానికి శిక్షణా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది.

గత సంవత్సరం అంకితి కంపెనీ , దాని అనుబంధ సంస్థల్లో డైరెక్టర్‌షిప్‌లకు రాజీనామా చేసింది. అంతకుముందు, ఆర్థిక అవకతవకల ఆరోపణలపై కంపెనీ ఆమెను సస్పెండ్ చేసింది. ఆమె తన సస్పెన్షన్‌ను మంత్రగత్తె వేటగా పేర్కొంది. తనపై చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలను చూపించడంలో జిలింగో బోర్డు  చూపించడంలో విఫలమైందని వ్యాఖ్యానించింది అంకితి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?