Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా? మిస్టరీ గర్ల్‌తో కెమెరా కంట పడిన క్రికెటర్

Yuzvendra Chahal Spotted With Mystery Girl: గత కొన్ని రోజులుగా యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకుల వార్తలు మారుమోగిపోతున్నాయి. ఇంతలో, చాహల్ ఒక మిస్టరీ అమ్మాయితో కనిపించాడు. ఇప్పుడు చాహల్, ధనశ్రీల విడాకుల వార్తలకు ఈ అమ్మాయి కారణమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా? మిస్టరీ గర్ల్‌తో కెమెరా కంట పడిన క్రికెటర్
Yuzvendra Chahal Dhanashree Verma
Follow us
Venkata Chari

|

Updated on: Jan 07, 2025 | 8:31 AM

Yuzvendra Chahal Spotted With Mystery Girl: చాలా కాలంగా టీమిండియాకు దూరమైన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వ్యక్తిగత జీవితం అంత బాగోలేదు. చాహల్‌కు అతని భార్య ధనశ్రీ వర్మతో విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అంతే కాదు, ధనశ్రీకి సంబంధించిన ఫొటోలను కూడా చాహల్ సోషల్ మీడియా నుంచి తొలగించాడు. అప్పటి నుంచి వీరి విడాకుల గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ విషయంపై వారిద్దరూ ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. ఇంతలో, యుజ్వేంద్ర చాహల్ ఇప్పుడు ఒక మిస్టరీ అమ్మాయితో కనిపించాడు. కెమెరా కంట కనపడగానే చాహల్ ముఖం దాచుకోవడం చూడొచ్చు.

మిస్టరీ గర్ల్‌తో కనిపించిన చాహల్..

ధనశ్రీ వర్మ నుంచి విడాకుల వార్తల మధ్య యుజ్వేంద్ర చాహల్ ఒక మిస్టరీ గర్ల్‌తో కనిపించాడు. ముంబైలోని జుహులో చాహల్ మిస్టరీ గర్ల్‌తో కనిపించాడు. చాహల్ ఓ అమ్మాయితో కలిసి కారులో కనిపించాడు. మీడియా కెమెరాలు అతడిని బంధించేందుకు ప్రయత్నించగా.. ఈ భారత క్రికెటర్ ముఖం దాచుకున్నాడు. అప్పటి నుంచి ధనశ్రీ, చాహల్‌ల విడాకుల వార్తలకు ఈ మిస్టరీ గర్ల్ కారణమా అనే చర్చలు జరుగుతున్నాయి.

విడాకుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది..

2023 సంవత్సరంలో ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి చాహల్ అనే ఇంటిపేరును తొలగించింది. ఈ క్రమంలో ఓ స్టోరీని కూడా పంచుకుంది. కొత్త జీవితం రాబోతోంది అంటూ రాసుకొచ్చింది. అప్పుడు కూడా వారి బంధానికి సంబంధించి రకరకాల చర్చలు జరిగాయి. అయితే, ఈ విషయం త్వరలోనే సద్దుమణిగింది. అయితే ఇప్పుడు ఇద్దరి దారులు వేరయ్యాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం, ఇద్దరూ విడాకులు తీసుకోవడం ఖాయమని తేలింది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

2020లో పెళ్లి..

యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల మొదటి సమావేశం లాక్ డౌన్ సమయంలో జరిగింది. డ్యాన్స్ నేర్చుకునేందుకు చాహల్ తనను సంప్రదించినట్లు ధనశ్రీ ఓ రియాల్టీ షోలో చెప్పింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారింది. చాహల్, ధనశ్రీ డిసెంబర్ 2020 లో చాలా వైభవంగా వివాహం చేసుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..