Disease X: ప్రపంచంపై మరో కొత్త మహమ్మారి దాడి చేయనుందా? అది ఎలాంటి వైరస్..!
Disease X: ప్రపంచంపై మరో కొత్త మహమ్మారి దాడి చేయనుందా? కరోనాకన్నా భయంకరమమైన 'డిసీజ్ ఎక్స్' పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు బ్రిటన్ వైద్య..
Disease X: ప్రపంచంపై మరో కొత్త మహమ్మారి దాడి చేయనుందా? కరోనాకన్నా భయంకరమమైన ‘డిసీజ్ ఎక్స్’ పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు బ్రిటన్ వైద్య నిపుణులు. మూడేళ్ల క్రితం ప్రపంచంపై దాడి చేసిన కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టకముందే మరో కొత్త వ్యాధి పొంచి ఉందని హెచ్చరికలు మొదలయ్యాయి. కరోనాలో రకరకాల వేరియంట్లకు తోడు కొంత కాలంగా మంకీపాక్స్ పలు దేశాలను వణికిస్తోంది. ఇదే సీరిస్‌లో మరో మహమ్మారి ఎటాక్ చేసే అవకాశం ఉందంటున్నారు బ్రిటన్ వైద్య నిపుణులు. దీనికి ‘డిసీజ్ ‘ఎక్స్’ అనే పేరుకూడా పెట్టేశారు. కరోనాకన్నా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ‘డిసీజ్ ‘ఎక్స్’ అనేది ప్రస్తుతానికి ఊహాజనితమైన అంటువ్యాధే అయినా, ఇది ప్రపంచం మీద సృష్టిచే విధ్వంసం ఊహించనంత తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులు మరింతగా విరుచుకుపడతాయంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఈడెన్‌బర్గ్‌కి చెందిన ఎపిడమాలజీ నిపుణులు ప్రొఫెసర్ మార్క్ వూల్‌హౌజ్.
కరోనాకన్నా తీవ్రమైన కొత్త వ్యాధులు వస్తాయని చెబుతున్నారు ప్రాఫెసర్ జీన్‌జాక్యూస్ ముయేంబే టామ్‌ఫమ్.. 1976లో ఎబోలా ను కనుక్కోవడంలో ఈయన కీలకపాత్ర పోషించారు. ఇటీవల బ్రిటన్‌లో మంకీపాక్స్ విజృంభన కలవరపెట్టింది. కాంగోఫీవర్, లాస్సా ఫీవర్, బర్డ్ ఫ్లూ కేసులు కూడా అక్కడ నమోదయ్యాయి. కొంత కాలం క్రితం బ్రిటన్ మురికినీటి నమూనాల్లో పోలియో వైరస్ నమూనాలు కనిపించడం ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలో డిసీజ్ ఎక్స్ కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. కొత్త వ్యాధులను ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే సిద్దంగా ఉండాలని బ్రిటన్ వైద్య నిపుణలు సూచిస్తున్నారు.
మూడేళ్ల కిందట విజృంభించి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి నుంచి కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఈ వైరస్ ఎంతో మందిని బలి తీసుకుంది. ఎంతో మంది కరోనా బారిన పడి ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఈ వైరస్ కారణంగా వివిధ వ్యాధులు చుట్టుముట్టి మరింత కుంగదీస్తున్నాయి. వైరస్ కట్టడికి లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ వల్ల ప్రస్తుతం అదుపులో ఉంది. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకురావడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌లు అంత అవుతాయని ఎప్పటికి అనుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి