Pakistan: వెస్ట్రన్ కంట్రీస్‌కు డంపింగ్ యార్డ్‌గా మారిన పాకిస్తాన్.. ఆ దేశాల్లోని చెత్తంతా పాక్‌లో డంప్
బ్రిటన్, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, అమెరికా, బెల్జియం, స్పెయిన్, జర్మనీ, కెనడా, ఇటలీ వంటి దేశాలు.. తమ దేశంలోని చెత్తను వేసుకునే డస్ట్‌బిన్‌గా పాకిస్థాన్ దేశాన్ని పరిగణిస్తున్నాయి.
Pakistan: దాయాది దేశం పాకిస్థాన్‌ను ప్రపంచంలోని అనేక దేశాలు ‘చెత్తను డంప్’ చేసుకునే దేశంగా పరిగణిస్తున్నాయి. అమెరికా, సౌదీ అరేబియా, కెనడా వంటి అనేక దేశాలు తమ దేశాల వ్యర్థాలను పాకిస్థాన్‌లో డంప్ చేస్తున్నాయి. ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. బ్రిటన్, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, అమెరికా, బెల్జియం, స్పెయిన్, జర్మనీ, కెనడా, ఇటలీ వంటి దేశాలు.. తమ దేశంలోని చెత్తను వేసుకునే డస్ట్‌బిన్‌గా పాకిస్థాన్ ను పరిగణిస్తున్నాయి. దీంతో పాకిస్థాన్‌లో వాతావరణ మార్పులపై తీవ్ర ప్రభావం చూపిస్తుండడం సెనేట్ స్టాండింగ్ కమిటీని కూడా ఆశ్చర్యపరిచింది. గణాంకాల ప్రకారం.. పాకిస్తాన్‌లో ప్రతి సంవత్సరం 30 మిలియన్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి 80 వేల టన్నుల చెత్త పాకిస్థాన్‌లోకి దిగుమతి అవుతోంది. సహజంగానే.. ఇది పర్యావరణం, ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.
దిగుమతి చేసుకున్న వ్యర్థాలపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదంటే.. దేశంలో ‘దిగుమతి అయ్యే వ్యర్థాలపై పాకిస్తాన్ ఎప్పుడూ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? దౌత్యకార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, సంబంధిత శాఖలు, రాష్ట్ర, సమాఖ్య ప్రభుత్వాలు దీన్ని ఎందుకు ఆపడానికి ప్రయత్నించడం లేదని ఓ సభ్యుడు ప్రశ్న లేవనెత్తారు. అదే సమయంలో.. మేము వ్యర్థాలను ఎందుకు మీ ఎగుమతి చేయకూడదని ఒక సెనేటర్ అన్నారు. మరోవైపు, ‘దిగుమతి చేసిన వ్యర్థాలను తిరస్కరిస్తున్నామని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఎంపీ ఫైసల్ జావేద్ అన్నారు.
బ్రిటన్ నుంచి చెత్త పాకిస్థాన్‌లోకి డంప్: నివేదికల ప్రకారం.. ఒక్క బ్రిటన్ దేశం గత సంవత్సరం పాకిస్తాన్‌లో దాదాపు 40,000 టన్నుల చెత్తను డంప్ చేసింది. ఈ ప్రమాదకరమైన వ్యర్థాల వలన పాక్ లో తీవ్రమైన పర్యావరణ, ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. ప్రస్తుతం ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుంది. పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.248కి చేరింది. దేశంలో రాజకీయ సంక్షోభం దిశగా నడుస్తోంది.
పాకిస్థాన్ సహాయ ప్యాకేజీని పునరుద్ధరించేందుకు IMF షరతులు: షాబాజ్ ప్రభుత్వంపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిరంతరం విరుచుకుపడుతున్నారు. మరోవైపు, గత నెలలో, IMF పాకిస్తాన్ ఆర్థిక ప్యాకేజీని పునరుద్ధరించడానికి విద్యుత్ ధరలను పెంచడం, పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను విధించడం వంటి కఠినమైన షరతులను విధించింది. అంతకుముందు, నగదు కొరతతో ఉన్న పాకిస్తాన్ తన నిలిచిపోయిన 6 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని పునరుద్ధరించడానికి IMFతో ఒప్పందం చేసుకుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..