Viral News: ఉద్యోగం కోసం యువకుడి విచిత్ర ప్రయత్నం.. ఆఫీస్‌ల బయట QR కోడ్ ఏర్పాటు

21 ఏళ్ల జార్జ్ కోర్నియుక్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని సెయింట్ ఎడ్మండ్ కళాశాలలో ఎకనామిక్స్ చదువుతున్నాడు.

Viral News: ఉద్యోగం కోసం యువకుడి విచిత్ర ప్రయత్నం.. ఆఫీస్‌ల బయట QR కోడ్ ఏర్పాటు
George Korneiuk
Follow us
Surya Kala

|

Updated on: Jul 02, 2022 | 10:51 AM

Viral News: కరోనా(Corona) వెలుగులోకి వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు మూతపడ్డాయి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నిరుద్యోగ సమస్య ప్రకంపనలు సృష్టిస్తోంది. యువతకు ఉద్యోగాలు రావడమంటే ఏదో గుప్త నిధిని వెతుక్కున్నట్లే అయింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే పోటీ ఎక్కువై ఒక్కో పోస్టుకు వేలల్లో దరఖాస్తులు రావడం.. అందులో ఒకరో ఇద్దరో మాత్రమే ఎంపిక అవ్వడంతో మిగిలిన అభ్యర్థులు నిరుద్యోగ బాటలో నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రయివేటు రంగంలో కూడా ఉద్యోగస్థుల పరిస్థితి బాగాలేదు. ఉద్యోగాల కోసం ప్రజలు అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాగా చదువుకున్న వారు కూడా తమ సీవీ లతో ఒక ఆఫీసు నుంచి మరో ఆఫీసుకు తిరుగుతున్నా ఉద్యోగాలు మాత్రం రావడం లేదు. ఇలాంటి సమస్యతో సతమతమవుతున్న ఓ వ్యక్తి ఉద్యోగం రాకపోవడంతో ‘ విచిత్రమైన ‘ ఉపాయం కనిపెట్టాడు . కంపెనీలకు వెళ్లి ఉద్యోగాలు వెతుక్కుంటూ విసిగిపోయి తన సీవీలోని క్యూఆర్ కోడ్‌ను ఆఫీసుల బయట అతికించాడు.

ఉద్యోగం కోసం ఎన్నో కష్టాలు పడుతున్నవారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. సీవీతో ఆఫీసులకు వెళ్లడం, ఆ తర్వాత ఎలాంటి స్పందన లేకుండా తిరిగి రావడం చాలా మందికి జరుగుతూనే ఉంది. వీరిలో ఒకరు 21 ఏళ్ల జార్జ్ కోర్నియుక్. అతను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని సెయింట్ ఎడ్మండ్ కళాశాలలో ఎకనామిక్స్ చదువుతున్నాడు. అయితే జార్జ్ కు బ్యాంకింగ్ లేదా బీమా రంగంలో ఉద్యోగానుభవం అవసరం. దీంతో అతను వివిధ కంపెనీలలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఏ కంపెనీ కూడా జార్జ్ ను ఉద్యోగానికి పిలవక పోవడంతో విసిగిపోయాడు. ఎక్కడికెళ్లినా తిరస్కారమే ఎదురవుతోంది. దీనితో కలత చెందిన జార్జ్ ఒక ప్రత్యేకమైన పద్ధతిని కనుగొన్నాడు.

CVలతో కూడిన QR కోడ్‌లు జార్జ్ .. ఆఫీసు భవనం బయట భారీ క్యూఆర్ కోడ్‌లను అతికిస్తున్నాడు. ఈ కోడ్ జార్జ్ CV , లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ కు లింక్ అయి ఉంది. ఆ QR కోడ్‌ని స్కాన్ చేసే వారికి జార్జ్ CV , లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ కనిపిస్తుంది. ఇలా సరికొత్త విధానంతో ఉద్యోగం కోసం వెతుకుతున్న వారిని చూడడం అరుదు.. అందుకనే జార్జ్ ఈ ఆలోచన చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ది మిర్రర్ కథనం ప్రకారం..  లండన్ కు చెందిన ఓ వ్యక్తి కథను చదివిన తర్వాత జార్జ్‌కి ఈ ఆలోచన వచ్చింది. లండన్ కు చెందిన వ్యక్తి కూడా ఉద్యోగంలో చాలా తిరస్కరణలను ఎదుర్కొన్న తర్వాత ఇలాంటి సృజనాత్మక విధానాన్ని అనుసరించాడు. ఆఫీస్ భవనాల వెలుపల CVతో QR కోడ్‌ను అతికించాడు. జార్జ్ కూడా అదే విధానాన్ని అవలంబించారు. అయితే ఇప్పటి వరకూ జార్జ్ ఆలోచన వర్కౌట్ కాలేదు.. అయితే చాలా కంపెనీలు జార్జ్ CV ని చూశాయని తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..