AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America and China: అమెరికాతో సంబంధాలపై చైనా.. తైవాన్ సమస్యపై యూఎస్.. అధ్యక్షుల సమావేశంలో చర్చలు!

అమెరికా, చైనా మధ్య సంబంధాన్ని సానుకూల దిశలో తీసుకెళ్లేందుకు చైనా సిద్ధంగా ఉందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది.

America and China: అమెరికాతో సంబంధాలపై చైనా.. తైవాన్ సమస్యపై యూఎస్.. అధ్యక్షుల సమావేశంలో చర్చలు!
Biden And Jinping
KVD Varma
|

Updated on: Nov 16, 2021 | 11:18 AM

Share

America and China: అమెరికా, చైనా మధ్య సంబంధాన్ని సానుకూల దిశలో తీసుకెళ్లేందుకు చైనా సిద్ధంగా ఉందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. అమెరికా-చైనా సంబంధాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇద్దరు నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూసింది. ఈ సమావేశంలో జీ జిన్‌పింగ్ అమెరికా, చైనా మధ్య సంబంధాలపై మాట్లాడారు. అదే సమయంలో, బిడెన్ మానవ హక్కులు.. ఇండో-పసిఫిక్ ప్రాంతంపై ఫోకస్ పెట్టి మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పోటీని నిర్ధారించడం.. వివాదంలో చిక్కుకోకుండా ఉండటమే తన లక్ష్యమని చెబుతూ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో, వాయువ్య చైనాలో ఉయ్ఘర్‌లపై మానవ హక్కుల ఉల్లంఘన, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య నిరసనలు, స్వయం ప్రతిపత్తి కలిగిన తైవాన్ ద్వీపంపై సైనిక దురాక్రమణ వంటి అనేక అంశాలపై బిడెన్ చైనాను విమర్శించారు.

‘పోటీ సాదాసీదాగా ఉండాలి, సంఘర్షణలా కాదు’

బిడెన్ సమావేశం ప్రారంభంలో ఇలా అన్నారు “మన దేశాల మధ్య పోటీ సరళంగా..సూటిగా ఉండేలా చూసుకోవడం చైనా.. యునైటెడ్ స్టేట్స్ నాయకులుగా మన బాధ్యత. ఇది ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోని సంఘర్షణను కలిగి ఉండకూడదు.”

ఈ సందర్భంగా జి జిన్‌పింగ్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సుస్థిర సంబంధాలు నెలకొనాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఇరు దేశాలు పరస్పరం గౌరవించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. తన “పాత స్నేహితుడు” బిడెన్‌ని చూడటం సంతోషంగా ఉందని అతను చెప్పాడు. ఇద్దరు నేతల మధ్య ఇది మూడో భేటీ. ఇద్దరు నాయకులు ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు కలిసి ప్రయాణించారు. వీరు ఒకరికొకరు బాగా తెలుసు.

తైవాన్ సమస్యపై ఉద్రిక్తత

జీ జిన్‌పింగ్ మాట్లాడుతూ, ‘ఏకాభిప్రాయాన్ని పెంపొందించడానికి, చురుకైన చర్యలు తీసుకోవడానికి, చైనా, యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాన్ని సానుకూల దిశలో ముందుకు తీసుకువెళ్ళడానికి నేను మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు. తైవాన్ సమస్య తమకు అత్యంత ప్రాధాన్యమైనదని చైనా అధికారులు ఇప్పటికే చెప్పారు. వాస్తవానికి, తైవాన్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత చైనా సైన్యం యుద్ధ విమానాల సంఖ్యను పెంచడం వల్ల ఉద్రిక్తతలు పెరిగాయి. బీజింగ్ ఈ మొత్తాన్ని తన భూభాగంలో భాగంగా పరిగణిస్తుంది. అంతేకాకుండా తైవాన్, ఇతర ఫ్లాష్‌పాయింట్ సమస్యలపై పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, రెండు దేశాలు కమ్యూనికేషన్‌ను మెరుగుపరచుకోవాలని, సవాళ్లను కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సమావేశంలో జిన్‌పింగ్ అన్నారు.

తైవాన్ సమస్య చైనా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతతో పాటు చైనా ప్రధాన ప్రయోజనాలకు సంబంధించినదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ అన్నారు. ఇది చైనా-అమెరికా సంబంధాల పరంగా కూడా అత్యంత ముఖ్యమైన, సున్నితమైన సమస్య. బిడెన్ దీర్ఘకాలంగా ఉన్న US ‘వన్ చైనా’ విధానానికి కట్టుబడి ఉంటారని వైట్ హౌస్ తెలిపింది. ఇది బీజింగ్‌ను గుర్తిస్తుంది. అయితే తైపీతో అనధికారిక సంబంధాలు, రక్షణ సంబంధాలను అనుమతించదు. తైవాన్ సమీపంలోని ద్వీపంలో యుఎస్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం పర్యటనకు ప్రతిస్పందనగా చైనా సైన్యం ఈ కసరత్తు చేసింది.

సమావేశానికి ముందు కొత్త చట్టానికి బిడెన్ గ్రీన్ సిగ్నల్..

సమావేశానికి ముందు, బిడెన్ సోమవారం 1 ట్రిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల బిల్లుపై సంతకం చేశారు, చైనాపై పోటీతత్వాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నందున దేశం లోని నాసిరకం మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి ఇది కీలకమైనది. “ఈ చట్టం కారణంగా, వచ్చే ఏడాది 20 సంవత్సరాలలో యూఎస్ మౌలిక సదుపాయాల పెట్టుబడులు చైనా కంటే వేగంగా వృద్ధి చెందే మొదటి సంవత్సరంగా మారుతుంది.” అని బిడెన్ చెప్పారు. రాబోయే దశాబ్దంలో, మనం మరోసారి అత్యుత్తమ రోడ్లు, వంతెనలు, ఓడరేవులు, విమానాశ్రయాలను కలిగి ఉంటామని ఆయన పేర్కొన్నారు.

సమ్మిట్‌కు ముందు, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, స్థిరమైన అభివృద్ధి కోసం సంబంధాలను సరైన మార్గంలో ఉంచాలని చైనా అమెరికాను కోరుతుందని చెప్పారు. చైనా-అమెరికా సంబంధాల భవిష్యత్తు, ఉమ్మడి ఆందోళనకు సంబంధించిన కీలక అంశాలపై ఇద్దరు అధ్యక్షులు తమ అభిప్రాయాలను పంచుకుంటారని జావో చెప్పారు. అదే సమయంలో అమెరికా, చైనాల మధ్య పోటీని బాధ్యతాయుతంగా నిర్వహించడంతోపాటు పరస్పర ప్రయోజనాలపై కలిసి పని చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చిస్తారని వైట్ హౌస్ తెలిపింది.

ఇవి కూడా చదవండి: Viral News: కండోమ్‌ కొనండి.. కారు సొంతం చేసుకోండి.. విచిత్రమైన పబ్లిసిటీపై సోషల్‌ మీడియాలో సెటైర్లు..

పాలుగారే బుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ యాంకర్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!!

Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..

Follow Us