Watch Video: కెనడాలో అర్థరాత్రి కాల్పులు.. ముగ్గురు భారతీయులు అరెస్ట్! వీళ్లు ఏం చేశారంటే?
రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల ఘటనలో భారత్‌కు చెందిన ముగ్గురు ట్రక్ డ్రైవర్‌లు పాల్గొన్నారనే ఆరోపణలతో వారిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. మిస్సింగ్‌లో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీరిపై అక్రమ ఆయుధాల వాడకం, అనధికారికంగా తుపాకీని కలిగి ఉండడం వంటి అభియోగాలు మోపినట్టు పోలీసులు తెలిపారు. ఈ కాల్పులకు సంబంధించిన వీడియోను సైతం పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కెనడాలో రెండు ప్రత్యర్థి ట్రక్ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత సంతతికి చెందిన ట్రక్ డ్రైవర్లను అరెస్టు చేశారు పోలీసులు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ సంఘటన అక్టోబర్ 7న రాత్రి 10:45 గంటలకు మెక్‌వీన్ డ్రైవ్, కాజిల్‌మోర్ రోడ్ ప్రాంతంలోని జరిగింది. ఒక్కసారిగా అక్కడికి వచ్చిన రెండు వేర్వేరు గ్రూపులు ఘర్షణకు దిగాయి, ఈ క్రమంలోనే రెండు గ్రూపుల మధ్య కాల్పులు కూడా జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్పులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. సుదీర్ఘ దర్యాప్తు తర్వాత ఈ కాల్పుల్లో పాల్గొన్న ఓ గ్రూపునకు సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను గుర్తించారు. దీంతో నవంబర్ 20న కాలెడాన్‌లోని ఒక ఇంటిపై దాడి చేసి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన అనుమానితులు ముగ్గురు భారత సంసతికి చెందిన మంజోత్ భట్టి, నవజోత్ భట్టి, అమంజోత్ భట్టిగా పోలీసులు గుర్తించారు, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఇక మంజోత్ భట్టి పై తుపాకీతో రెక్‌లెస్‌గా కాల్పులు జరిపాడనే అభియోగాలు మోపగా..నవ్‌జోత్, అమన్‌జోత్ పై వాహనంలో తుపాకీ ఉన్నట్టు తెలిసినా కూడా ప్రయాణించారనే అభియోగాలను మోపారు పోలీసులు. ఇక నాగులో వ్యక్తి పేరు ఇంకా పోలీసులు ప్రస్తావించలేదు. కానీ అతని సంబంధించిన ఒక వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో నల్ల జాకెట్, బ్లూ జీన్స్, తెల్ల రన్నింగ్ షూస్ ధరించిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటన టో ట్రక్ ఇండస్ట్రీలో ప్రత్యర్థతల నేపథ్యంలో జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ రెండు గ్రూపులు దక్షిణ ఆసియా సముదాయానికి చెందినవిగా పేర్కొన్నారు.
వీడియో చూడండి..
Tow Truck Rivalry Leading to Shooting: 3 Arrests, 1 Suspect Still Wanted 🚨
On October 7, an altercation between rival tow truck groups escalated into gunfire, leaving one person with minor injuries. After weeks of investigation, @PeelPolice have arrested three individuals, but… pic.twitter.com/xm9NQYKXM1
— Peel Regional Police (@PeelPolice) December 11, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
