భారతీయులకు మరో బిగ్ షాక్..! టూరిస్ట్ వీసాలపై అమెరికా సంచలన నిర్ణయం..!
సుంకాల నుంచి వీసాల దాకా సెకండ్ టర్మ్‌లో ఏదో ఒక పిట్టింగ్ పెట్టడమే పనిగా పెట్టుకున్నారు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్. అమెరికాకు వచ్చి ఎక్కడ పిల్లలను కనేస్తారోనని ముందే రిజెక్ట్ స్టాంప్ కొట్టేయడానికి రెడీ అయింది అగ్రరాజ్యం. ఆ డౌటు వస్తే టూరిస్ట్ వీసా ఇవ్వలేమంటూ.. అమెరికా రాయబార కార్యాలయం సోషల్‌మీడియాలో ఏకంగా అఫీషియల్ సర్క్యులర్ ఇచ్చేసింది.

సుంకాల నుంచి వీసాల దాకా సెకండ్ టర్మ్‌లో ఏదో ఒక పిట్టింగ్ పెట్టడమే పనిగా పెట్టుకున్నారు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్. అమెరికాకు వచ్చి ఎక్కడ పిల్లలను కనేస్తారోనని ముందే రిజెక్ట్ స్టాంప్ కొట్టేయడానికి రెడీ అయింది అగ్రరాజ్యం. ఆ డౌటు వస్తే టూరిస్ట్ వీసా ఇవ్వలేమంటూ.. అమెరికా రాయబార కార్యాలయం సోషల్‌మీడియాలో ఏకంగా అఫీషియల్ సర్క్యులర్ ఇచ్చేసింది.
పుట్టబోయే చిన్నారులకు అమెరికా పౌరసత్వం పొందడమే పర్యాటకుల ప్రధాన ఉద్దేశంగా తాము భావిస్తే.. అటువంటి వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తామని చావు కబురు చల్లగా చెప్పేసింది అమెరికా. వలస విధానాన్ని కఠినతరం చేస్తున్న ట్రంప్ యంత్రాంగం.. ఇతర వీసాలతోపాటు టూరిస్ట్ వీసాల విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. పుట్టబోయే చిన్నారికి పౌరసత్వమే అమెరికా పర్యటన ఉద్దేశమని తాము భావిస్తే.. అలాంటి దరఖాస్తులను తిరస్కరిస్తామని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ అడ్డదారి ప్రయత్నాలను ఏమాత్రం అనుమతించం అంటూ భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
U.S. consular officers will deny tourist visa applications if they believe the primary purpose of travel is to give birth in the United States to obtain U.S. citizenship for the child. This is not permitted. pic.twitter.com/Xyq4lkK6V8
— U.S. Embassy India (@USAndIndia) December 11, 2025
అమెరికాలో పుట్టే పిల్లలకు శతాబ్దకాలంగా సహజసిద్ధ పౌరసత్వం లభిస్తోంది. దీంతో ఆ దేశంలో ప్రసవం చేసుకోవాలని కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే రెండోసారి అధికారంలోకి రాగానే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ విధానానికి ముగింపు పలుకుతూ జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వుపై సంతకం చేశారు. ట్రంప్ వలసలకు సంబంధించిన విధానాలలో సుప్రీంకోర్టు తుది తీర్పు కోసం వెళ్లిన మొదటి వివాదం ఇదే. అక్రమంగా లేదంటే తాత్కాలికంగా అమెరికాలో నివసిస్తున్న తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు అమెరికా పౌరులు కాదంటూ ట్రంప్ జారీచేసిన ఉత్తర్వును సుప్రీంకోర్టు పరిశీలనకు స్వీకరించింది. ఈ ఉత్తర్వు రాజ్యాంగబద్దతపై త్వరలో తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.
జన్మహక్కు పౌరసత్వం ద్వారా దేశంలోకి వస్తున్న లక్షల మందికి ఆశ్రయం కల్పించే స్థోమత అమెరికాకు లేదని చెప్పేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఒకవేళ సుప్రీంకోర్టు తన వాదనకు అనుకూలంగా తీర్పు ఇస్తే.. ఇప్పటికే పొందిన పౌరసత్వాలను రద్దు చేయాలో లేదో ఇంకా ఆలోచించలేదంటున్నారు. మరోవైపు తమ దేశానికొచ్చే పర్యాటకులు సోషల్ మీడియా హిస్టరీని అందించడాన్ని తప్పనిసరి చేసే ఆలోచనలో ఉంది ట్రంప్ సర్కార్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
