నెల రోజోల్లోనే మరోమారు బారులో కాల్పులు.. 12 మంది అక్కడికక్కడే మృతి..

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Oct 16, 2022 | 7:37 PM

గుర్తు తెలియని దుండగులు శనివారం సాయంత్రం మెక్కికోలోని ఓ బారులో ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. సెంట్రల్ మెక్సికన్ నగరమైన ఇరాపుటోలోని బార్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో..

నెల రోజోల్లోనే మరోమారు బారులో కాల్పులు.. 12 మంది అక్కడికక్కడే మృతి..
Mexico Bar Attack

గుర్తు తెలియని దుండగులు శనివారం సాయంత్రం మెక్కికోలోని ఓ బారులో ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. సెంట్రల్ మెక్సికన్ నగరమైన ఇరాపుటోలోని బార్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో 12 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నెల రోజుల వ్యవధిలో సామూహిక కాల్పులకు పాల్పడటం ఇది రెండో సారని స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు. కాల్పులు జరపడానికి గల కారణాలేమిటనేది ఇంత వరకు తెలియరాలేదని, భద్రతా అధికారులు దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.

మెక్సికో ప్రధాన నగరాల్లో గ్వానాజువాటో ముఖ్యమైనది. ప్రపంచంలోని అనేక అగ్రశ్రేణి కార్ల తయారీకి ఈ నరగం ప్రధానం కేంద్రం. డ్రగ్స్‌ గ్యాంగుల మధ్య భీకర పోరు నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులు గత కొంతకాలంగా ఆందోళనకరంగా ఉన్నాయి. గత నెల (సెప్టెంబర్) 21న ఇరాపుటోకు 96 కి.మీ. దూరంలో ఉన్న గ్వానాజువాటో సిటీలో టారిమోరోలోని బార్‌లో ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపు 10 మంది మృతి చెందారు.

ఇవి కూడా చదవండి

2018లో ప్రెసిడెంట్‌గా నియామకమైన ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ మెక్సికోలోని డ్రగ్స్ మాఫియా హింసను తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఐతే ఆండ్రెస్ మాన్యుయెల్ అధికారం చేపట్టిన తర్వాత ఈ నరమేధం కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తిగా నియంత్రించలేకపోయారు. గత ప్రభుత్వాల హయాంలలో అవినీతి అక్రమాలకు ఆజ్యం పోసినట్లు ఆండ్రెస్ మాన్యుయెల్ ఆరోపించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu