Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Food Day: ప్రపంచం వ్యాప్తంగా ఎంత ఆహారం వృధా అవుతోంది.. గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ప్రపంచవ్యాప్తంగా ఆహార వృధా గణాంకాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆహారం ఎంతో వృథా అవుతోంది. అక్టోబర్‌ 16న ప్రపంచ ఆహార దినోత్సవం. ఈ పరిస్థితిని..

World Food Day: ప్రపంచం వ్యాప్తంగా ఎంత ఆహారం వృధా అవుతోంది.. గణాంకాలు ఏం చెబుతున్నాయి?
World Food Day
Follow us
Subhash Goud

|

Updated on: Oct 16, 2022 | 7:36 PM

ప్రపంచవ్యాప్తంగా ఆహార వృధా గణాంకాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆహారం ఎంతో వృథా అవుతోంది. అక్టోబర్‌ 16న ప్రపంచ ఆహార దినోత్సవం. ఈ పరిస్థితిని అధిగమించడమే ప్రపంచ ఆహార దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆహారం వృధా అవుతోంది. వృధా అవుతున్న ఆహారం లక్షలాది మంది ఆకలిని తీర్చవచ్చు. ఇలా వృధా కాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. జానెడు పొట్ట నింపుకోవటానికి కాయకష్టం చేసే కూలీల నుంచి కోట్లకు పడగలెల్లినవారు కూడా ఆకలితో ఏ పని చేయలేదు. ఆ కడుపు నింపుకోవటానికి ఎన్నో పాట్లు పడాల్సి వస్తుంటుంది. ఈ ఆకలి అనేది ఆకలి సమస్య పేద దేశాల్లోనే కాదు.. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఆకలి కేకలు వినిపిస్తుండటం గమనించాల్సిన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నింటిన్నింటిని సమానత్వంతో చూస్తుంది ఆకలి. మనిషే కాదు.. ప్రతీ జీవిని ఆకలి సమానత్వంతోనే చూస్తుంది. పేద గొప్పా తనే తేడా లేదు ఆకలికి. అటువంటి ఆకలి తీర్చటానికే ఈ ప్రపంచ ఆహార దినోత్సవం. ప్రపంచ ఆకలి తీర్చడమే వరల్డ్‌ ఫుడ్‌ డే ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలు ఈ ‘వరల్డ్‌ ఫుడ్‌ డే’ కార్యక్రమంలో పాల్గొంటాయి.

  1. అన్నింటిలో మొదటిది ప్రపంచంలో ఎంత ఆహారం వృధా అవుతుందో తెలుసుకోండి. ప్రపంచంలో తయారయ్యే ఆహారంలో మూడో వంతు అంటే దాదాపు 130 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల మంది ప్రజలు సరిపడా ఆహారం పొందలేకపోతున్నారు.
  2. ప్రపంచవ్యాప్తంగా 61 శాతం ఆహారాన్ని, ఇళ్లలో 23 శాతం, రెస్టారెంట్లలో 13 శాతం వృధా అవుతున్నట్లు గణాంకాలు వెలువడుతున్నాయి.
  3. ఒక వ్యక్తి వార్షిక వృధా ఆహారం గురించి మాట్లాడితే భారతదేశంలో ఒక వ్యక్తికి 50 కిలోల ఆహారం, అమెరికాలో 59 కిలోల ఆహారం, అలాగే చైనాలో 64 కిలోల ఆహారం వృథా అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
  4. చిన్న ప్రయత్నాలతో కూడా ఆహారం వృధాను చాలా వరకు అరికట్టవచ్చు. ఉదాహరణకు ప్లేట్‌లో మీరు ఎంత తినగలిగితే అంత తీసుకోండి. చాలా ఆహారాన్ని ముందుగానే నిల్వ చేయవద్దు. ఆకలి కంటే కొంచెం తక్కువగా తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
  5. ఇవి కూడా చదవండి
  6. ఇంట్లో ఎక్కువ ఆహారం ఉంటే దానిని ఏదైనా వ్యక్తికి లేదా ఫుడ్ బ్యాంక్‌తో పంచుకోండి. కిచెన్ గార్డెన్‌లో ఆహార వ్యర్థాలను ఉపయోగించండి. వృధా అవుతున్న ఆహారం వల్ల లక్షలాది మంది ఆకలిని తీర్చవచ్చు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి