చైనా ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తాం.. తైవాన్‌కు మరోసారి డైరెక్ట్‌ వార్నింగ్‌ ఇచ్చింది డ్రాగన్‌ కంట్రీ

తైవాన్‌కు మరోసారి డైరెక్ట్‌ వార్నింగ్‌ ఇచ్చింది డ్రాగన్‌ కంట్రీ. చైనాలో తైవాన్‌ విలీనం కోసం బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. వేర్పాటువాదానికి ప్రయత్నిస్తే విడిచిపెట్టే ప్రసక్తే..

చైనా ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తాం.. తైవాన్‌కు మరోసారి డైరెక్ట్‌ వార్నింగ్‌ ఇచ్చింది డ్రాగన్‌ కంట్రీ
Xi Jinping
Follow us

|

Updated on: Oct 16, 2022 | 8:32 PM

తైవాన్‌కు మరోసారి డైరెక్ట్‌ వార్నింగ్‌ ఇచ్చింది డ్రాగన్‌ కంట్రీ. చైనాలో తైవాన్‌ విలీనం కోసం బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. వేర్పాటువాదానికి ప్రయత్నిస్తే విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌. తైవాన్‌ తనను తానే సార్వభౌమాధికార, స్వతంత్ర దేశంగా భావిస్తోందని, కానీ చైనా మాత్రం తమ నుంచి విడిపోయిన ప్రావిన్సుగానే చూస్తోందన్నారు. హాంకాంగ్‌ మాదిరిగానే తైవాన్‌ను చైనాలో అంతర్భాగం చేసి తీరుతామని ప్రకటించారు జిన్‌పింగ్‌. తైవాన్‌ను తిరిగి కలుపుకునేందుకు శాంతియుతంగానే ప్రయత్నిస్తాం, ఒకవేళ ఎదురుతిరిగితే మాత్రం బలప్రయోగం చేయడానికి వెనుకాడబోమన్నారు జిన్‌పింగ్‌. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ 20వ మహా సభల్లో ప్రారంభోపన్యాసం చేసిన జిన్‌పింగ్‌… తైవాన్‌కి నేరుగా ఈ హెచ్చరికలు పంపారు.

వరుసగా మూడోసారి సీపీసీ అండ్‌ చైనా పగ్గాలు చేపట్టబోతున్న జిన్‌పింగ్‌, అమెరికాపైనా నిప్పులు చెరిగారు. తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ హెచ్చరించారు. చైనా సార్వభౌమాధికారం, భద్రత, దేశ ప్రయోజనాలను కాపాకునేందుకు ఎంతవరకైనా వెళ్తామంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ పంపారు. తైవాన్‌ను చైనా భూభాగంతో ఏకం చేయడానికి ఏ స్థాయికైనా వెళ్తామన్నారు జిన్‌పింగ్‌. చైనా వార్నింగ్‌పై అంతే స్ట్రాంగ్‌గా రియాక్టైంది తైవాన్‌. తమ దేశ సార్వభౌమాధికారం, స్వేచ్ఛపై రాజీపడే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. బీజింగ్‌ ఏకపక్ష నిర్ణయాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేమని తేల్చిచెప్పింది తైవాన్‌. తమ భవిష్యత్‌ను నిర్ణయించుకున్న తమకుందంటోన్న తైవాన్‌… శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇరు దేశాలపై ఉందని

ఇక, మూడోసారి దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న షి జిన్‌పింగ్‌… జీవితకాలం ఆ పదవుల్లో కొనసాగేలా చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ రూల్స్‌ను మార్చబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజింగ్‌లో ఐదేళ్లకు ఒకసారి జరిగే కమ్యూనిస్ట్‌ పార్టీ కాంగ్రెస్‌ ప్రారంభోత్సవంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తైవాన్‌పై బలప్రయోగాన్ని ఎప్పటికి వదులుకోమని కరాఖండిగా చెప్పారు. అలాగే హాంకాంగ్‌పై పట్టు సాధించి నియంత్రణలోకి తెచ్చుకున్నామని తర్వాత తైవానే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తైవాన్‌ తీవ్రంగా ప్రతిస్పందించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి