Turkey Earthquake: ఓ వైపు ఆర్తనాదాలు.. మరోవైపు లూటీలు, చోరీలు.. భగవంతుడా.. ఇదేనా నీ ఆట.
టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రకృతి విపత్తులు మానవాళిని ఎంతలా కబలిస్తాయో చెప్పడానికి ప్రత్యక్షసాక్ష్యంగా నిలిచిందీ సంఘటన. వేలాది మంది మృతి చెంది చెందారు...
టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రకృతి విపత్తులు మానవాళిని ఎంతలా కబలిస్తాయో చెప్పడానికి ప్రత్యక్షసాక్ష్యంగా నిలిచిందీ సంఘటన. వేలాది మంది మృతి చెంది చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎంతో మంది కుటుంబ సభ్యులను కోల్పోయారు. మృతుల సంఖ్య 50 వేలకు చేరుతుందని UNO ఆందోళన చెందుతోంది. గత సోమవారం సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 28 వేలు దాటింది. గడ్డకట్టే చలిని లెక్కచేయకుండా సహాయక సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉన్నారు. మరో వైపు సమయం గడుస్తున్న కొద్ది శిధిలాల కింద చిక్కుకున్న వారి ప్రాణాలతో బయటపడతారనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. 20 ఏళ్ల క్రితం ఇరాక్‌ను అతలాకుతలం చేసిన భూకంపంలో 31 వేల మంది మరణించారు. ఇప్పుడు టర్కీ, సిరియాలో మృతుల సంఖ్య 50 వేలు దాటుతుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
అటు సహయక బృందాలు ఎంతో శ్రమపడి కాపాడిన ఒక మహిళ ఆస్పత్రిలో చేరిన కొన్ని గంటలకే మరణించారు. మృతుల సంఖ్యను వెల్లడించడం సిరియా ప్రభుత్వం శుక్రవారం నుంచి నిలిపేసింది. అయిన వాళ్లు క్షేమంగా బయటపడాలని అంతా ప్రార్థనలు చేస్తుంటే కొందరు దొంగలు లూటీలకు పాల్పడుతున్నారు. ఇలా లూటీలకు పాల్పడుతున్న 50 మందిని టర్కీ పోలీసులు అరెస్టు చేశారు. మరో వైపు టర్కీలో భూకంపం సంభవించిన ప్రాంతాల్లో వివిధ వర్గాలు ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. కొన్ని చోట్ల కాల్పులు కూడా జరుగుతున్నాయి. ఈ ఘర్షణల కారణంగా కొన్ని ప్రాంతాల్లో జర్మనీ, ఆస్ట్రియా నుంచి వచ్చిన సహాయబృందాలు తమ పనులు ఆపేశాయి. సహాయక బృందాలు తమ పనులు కొనసాగించేందుకు టర్కీ సైన్యం రంగంలోకి దిగింది.
సోమవారం తెల్లవారుజామున టర్కీ, సిరియాను కుదేపిసిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతగా నమోదైంది. మరో వైపు టర్కీలో సంభవించిన భూకంపం భారత్‌కు చెందిన వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. టర్కీకి భారత్ నుంచి భారీ స్థాయిలో సింథటిక్ ఇతర నూలు ఎగుమతవుతుంది. టర్కీలో వీటిని కార్పెట్స్, ఫ్యాషన్ దుస్తులుగా మార్చి వాటిని యూరోప్, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..