‘ఆ మూడు దేశాలకు వెళ్లారో..’ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్

ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీ దేశాలకు ప్రయాణించవద్దంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మూడు దేశాలపై ప్రయాణ సంబంధ ఆంక్షలు విధించారు. ఇరాన్ నుంచి తమ దేశం చేరుకున్నఓ మహిళ కరోనా వైరస్

'ఆ మూడు దేశాలకు వెళ్లారో..' అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 01, 2020 | 2:29 PM

ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీ దేశాలకు ప్రయాణించవద్దంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మూడు దేశాలపై ప్రయాణ సంబంధ ఆంక్షలు విధించారు. ఇరాన్ నుంచి తమ దేశం చేరుకున్నఓ మహిళ కరోనా వైరస్ కారణంగా మరణించిందని, దాదాపు 50 ఏళ్ళ వయసున్న ఈమె  హైరిస్క్ పేషంట్ గా ఆసుపత్రిలో చేరిందని ఆయన అన్నారు. అమెరికాలో ఇదే మొట్టమొదటి డెత్ కేసని ఆయన చెప్పారు. ఇంకా మరికొన్ని కేసులు కూడా బయట పడవచ్ఛునని, పూర్తి ఆరోగ్యవంతులు ఈ వ్యాధి బారిన పడినా త్వరగా కోలుకోగలుగుతారని ట్రంప్ పేర్కొన్నారు. ఏమైనా….  అమెరికన్లు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా దక్షిణ ప్రాంత సరిహద్దును మూసివేసే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన తెలిపారు. ఆ ప్రాంత సెనెటర్లు.. ఈ కరోనా వ్యాప్తికి గల ముప్పును తన దృష్టికి తెచ్చారన్నారు.

కరోనాకు గురై 15 మందికి పైగా రోగులు అమెరికాలో కోలుకున్నారు. ఇలా ఉండగా.. గత రెండు వారాల్లో ఇరాన్ వెళ్లిన విదేశీయులు అమెరికాలో తిరిగి ప్రవేశించకుండా  నిషేధం ఉందని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు. ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా, ఇటలీ దేశాల నుంచి కరోనా కేసుల సమాచారం ఎక్కువగా వస్తోందని, దీనిపై దృష్టి పెట్టాలని ట్రంప్ తనను కోరారని ఆయన చెప్పారు. చైనాలో ఓ వైపు ఈ వ్యాధికి సంబంధించిన కేసులు తగ్గుతుండగా, మరోవైపు ఇటలీ, కొరియా, తైవాన్, బ్రిటన్ వంటి దేశాల్లో కొత్తగా ఈ కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?