మునిగిన కార్గో షిప్.. చైనీయుడుతో సహా 13 మంది మిస్సింగ్..
జపాన్ తీరంలో ఓ కార్గో నౌక మునిగిపోయింది. ఈ ఘటనలో 13 మంది మిస్సయ్యారు. జపాన్‌లోని అమోరి ప్రిఫెక్చర్ తీరంలో.. శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గుక్సింగ్ -1 అనే షిప్‌లో ఫిషింగ్‌కు వెళ్లి వస్తుండగా.. మధ్యాహ్నం 1.20 గంటల ప్రాంతంలో మునిగిపోయింది. రేవుకు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. వెంటనే నాలుగు గస్తీ చేపట్టే బోట్స్‌లో రెస్క్యూటీం రంగంలోకి దిగింది. మునిగిన నౌక నుంచి ఓ సిబ్బందిని కాపాడారు. అయితే మిగతా 13 మంది కూడా […]
జపాన్ తీరంలో ఓ కార్గో నౌక మునిగిపోయింది. ఈ ఘటనలో 13 మంది మిస్సయ్యారు. జపాన్‌లోని అమోరి ప్రిఫెక్చర్ తీరంలో.. శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గుక్సింగ్ -1 అనే షిప్‌లో ఫిషింగ్‌కు వెళ్లి వస్తుండగా.. మధ్యాహ్నం 1.20 గంటల ప్రాంతంలో మునిగిపోయింది. రేవుకు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. వెంటనే నాలుగు గస్తీ చేపట్టే బోట్స్‌లో రెస్క్యూటీం రంగంలోకి దిగింది. మునిగిన నౌక నుంచి ఓ సిబ్బందిని కాపాడారు. అయితే మిగతా 13 మంది కూడా విదేశీయులే అందులో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఓ చైనీయుడితో పాటుగా.. వియత్నాం, ఫిలిప్పీన్స్‌కు చెందిన వారు ఉన్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.