పాలకూర మంచిదే కానీ.. వీరికి విషంతో సమానం.. అస్సలు తినకూడదంట..!

పాలకూరలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే... పాలకూరను సూపర్ ఫుడ్ గా పేర్కొంటారు. ఇందులో ఉండే ఐరన్, క్యాల్షియం, పీచు, విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, పాలకూర తినడం కొంతమందికి తీవ్రమైన హాని కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఎలాంటి వ్యక్తులు పాలకూర తినకూడదో తెలుసుకోండి..

పాలకూర మంచిదే కానీ.. వీరికి విషంతో సమానం.. అస్సలు తినకూడదంట..!
Spinach
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 04, 2025 | 2:00 PM

పాలకూరలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే… నిపుణులు పాలకూరను తరచుగా సూపర్ ఫుడ్ గా పేర్కొంటారు. ఇందులో ఉండే ఐరన్, క్యాల్షియం, పీచు, విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, పాలకూర తినడం కొంతమందికి తీవ్రమైన హాని కలిగిస్తుందని చెబుతున్నారు.. వాస్తవానికి పాలకూరలో శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి.. అందుకే.. పాలకూరను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తారు..

పాలకూరను ఇతర ఆహారాలతో కలిపి తీసుకోవడం కూడా మంచిదే.. ఇలా చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే.. పాలకూర కొందరికి హాని కలిగిస్తుంది.. కొన్ని సమస్యలతో బాధపడే వారు పాలకూర తినడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

పాలకూర ప్రయోజనాలతో పాటు, కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది.. కొన్ని సమస్యలతో బాధపడేవారు పాలకూరను అస్సలు తినకూడదు.. ఎందుకంటే అది వారి పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉంటుంది.. పాలకూరను ఎవరు తినకూడదు.. డైటీషియన్లు ఏం చెబుతున్నారు.. ఈ వివరాలను తెలుసుకోండి..

పాలకూర ఎవరు తినకూడదంటే..

కిడ్నీ స్టోన్ రోగులు: పాలకూరలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాల్షియంతో పాటు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలను పెంచుతుంది. కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు పాలకూరను తినకూడదు.. ఎందుకంటే అది వారి పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.

అధిక యూరిక్ యాసిడ్ ఉన్న రోగులు: యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారికి పాలకూర హానికరం. పాలకూరలో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది.. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది.. గౌట్ వంటి సమస్యలకు దారితీస్తుంది.

ఐరన్ ఓవర్‌లోడ్ ఉన్న వ్యక్తులు: పాలకూర ఐరన్ కు అద్భుతమైన మూలం. అయితే, ఇప్పటికే శరీరంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవారు పాలకూరను తినకుండా ఉండాలి. ఐరన్ ఓవర్‌లోడ్ కాలేయం, గుండె సమస్యలను కలిగిస్తుంది.

బ్లడ్ థిన్నర్స్ మందులు తీసుకునే రోగులు: పాలకూరలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది.. ఇది రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. కానీ ఒక వ్యక్తి రక్తాన్ని పలచబరిచే ఔషధం తీసుకుంటే, పాలకూర తీసుకోవడం వల్ల ఔషధ ప్రభావం తగ్గి ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

కడుపులో గ్యాస్ – అసిడిటీతో బాధపడుతున్న వ్యక్తులు: పాలకూరలో కడుపులో గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలను పెంచే కొన్ని అంశాలు ఉన్నాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు పాలకూరను తక్కువగా తీసుకోవాలి లేదా తినకూడదు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..