US Toddler: ప్రపంచంలో అరుదైన వ్యాధి బారిన పడిన చిన్నారి బాలుడు.. నయా ఐన్‌స్టీన్‌గా ఫేమస్
US Toddler: ప్రపంచ వ్యాప్తంగా జుట్టులో అనేక రకాలు ఉన్నాయి. కొంతమంది జుట్టు సాప్ట్ గా సిల్కిగా ఉంటే.. మరికొందరికి కర్లింగ్, ఇంకొందరిది మందమైన వెంట్రుకలు ఇలా పలు రకాల వెంట్రుకలు ఉంటాయి. కానీ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్..
US Toddler: ప్రపంచ వ్యాప్తంగా జుట్టులో అనేక రకాలు ఉన్నాయి. కొంతమంది జుట్టు సాప్ట్ గా సిల్కిగా ఉంటే.. మరికొందరికి కర్లింగ్, ఇంకొందరిది మందమైన వెంట్రుకలు ఇలా పలు రకాల వెంట్రుకలు ఉంటాయి. కానీ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్(Insten)ఫోటో చూసిన వారికీ మాత్రం ఆయన జుట్టు వెరీ వెరీ స్పెషల్ అనిపిస్తుంది. తాజాగా ఓ బుడ్డోడు.. ఐన్‌స్టీన్ వంటి జుట్టుతో నయా ఐన్‌స్టీన్ గా ఫేమస్ అయ్యాడు. ఈ బాలుడు పేరు లాక్లాన్ శాంపిల్స్( Locklan). వయసు 14 నెలలు.
యునైటెడ్ స్టేట్స్‌లోని జార్జియాకు చెందిన ఆ చిన్నారి లాక్లాన్ శాంపిల్స్ కు ఐన్‌స్టీన్ లాంటి వెంట్రుకలే వచ్చాయి. దీనికి కారణం అన్‌కాంబేబుల్ హెయిర్ సిండ్రోమ్ అనే వ్యాధి బారిన చిన్నారి బాలుడు పడ్డాడని వైద్యులు చెప్పారు. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా మహా అయితే ఓ 100 కేసులుంటాయంతే. అంత, అరుదైన వ్యాధి. ఈ వెంట్రుకల్లో ఇన్న ప్రత్యేకత ఏంటంటే ఇవి వాటర్ రెసిస్టెంట్ లాక్స్‌ను కలిగి ఉండటం.
View this post on Instagram
లాక్లాన్ దాదాపు ఐదు నెలల వయస్సులో ఉన్నప్పుడు ఇలాంటి జుట్టు రావడం ప్రారంభమయ్యిందంట. అప్పటి నుంచి బాలుడు జుట్టు ఒక వెంట్రుక మరో వెంట్రుక అంటుకోని విధంగా వెరైటీగా పెరుగుతోంది. ఈ పిల్లాడి జుట్టు ఎప్పటికీ చిక్కుపడదు. ఈ బాలుడికి సదరు సిండ్రోమ్ వల్ల జుట్టు ఇలా వచ్చిందని తల్లిదండ్రులకు ఎలాంటి చింతా లేదు. పైగా, అందరి జుట్టులా మాసిపోదు.. కేవలం వారానికి ఒకసారి మాత్రమే జుట్టుపైన జస్ట్ నీళ్లు పోస్తే క్లీన్ అయిపోతుందని లాక్లాన్ తల్లి కేట్లిన్ శాంపిల్స్ ఆనందంగా చెబుతున్నారు. తన కుమారుడి జుట్టు సంరక్షణను ఈ జుట్టు ఈజీ చేసింది అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాక్లాన్‌కు జుట్టు ఇలా ఉండటం తప్ప ఇంకే విధమైన అనారోగ్యమూ లేకపోవడంతో తండ్రి కాలేబ్, తల్లి కేట్లిన్‌లు సంతోషంగానే ఉన్నారు. తాజాగా అతడి ఫొటోను కుటుంబ సభ్యులు సోషల్ పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు. దీంతో ఈ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ పిల్లాడి పేరుతో ఇన్ స్టా ఖాతా కూడా తెరిచారు.
View this post on Instagram
ఈ అరుదైన హెయిర్ సిండ్రోమ్ కలిగిన వారిలో జుట్టు ఇలాగే, పొడిగా ఉంటుందని, దాన్ని సాధారణంగా నున్నగా దువ్వలేమని వైద్యులు తెలిపారు. బాబును చూస్తున్న డాక్టర్ ప్రపంచంలో ఇలాంటి వ్యాధి ఉన్నవారిని సంప్రదించి, ఎలాంటి వైద్యం చేయలనే దానిపై పరిశోధన చేస్తున్నారు. మరోవైపు తన వెరైటీ జుట్టుతో లాక్లాన్ ఇంటి చుట్టుపక్కల మాత్రమే.. కాదు సోషల్ మీడియాలో కూడా సెలబ్రిటీ అయ్యాడు. నయా ఐన్‌స్టీన్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read: