AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine Crisis: ఆ విషయం తెలిసి చాలా సంతోషించాను.. నువ్వక్కడ జాగ్రత్త.. హీరో చిరంజీవి!

ఉక్రెయిన్ లో చిక్కుకున్న డాక్టర్ గిరి కుమార్‌ను ఉద్దేశిస్తూ మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్విటర్‌ ద్వారా స్పందించారు. చిరంజీవి పోస్ట్‌ చేసిన ట్వీట్‌లో ఈ విధంగా..

Russia Ukraine Crisis: ఆ విషయం తెలిసి చాలా సంతోషించాను.. నువ్వక్కడ జాగ్రత్త.. హీరో చిరంజీవి!
Dr Ravi Kumar
Srilakshmi C
|

Updated on: Mar 10, 2022 | 11:03 AM

Share

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో భీకర యుద్ధపోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. యుద్ధం కారణంగా అక్కడి జనాలు బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. ఉక్రెయిన్‌ (Ukraine)లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు (Students), పౌరులు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. కానీ ఇంత యుద్ధం జరుగుతున్నా..హీరో చిరంజీవి స్ఫూర్తితో జాగ్వార్, పాంథర్ పులులను పెంచుకుంటూ వాటిని రక్షించుకోవడం కోసం, యుక్రెయిన్లోనే వున్న తెలుగు వైద్యుడు గిరికుమార్.. ఎట్టి పరిస్థితిలోనూ ఆ దేశాన్ని వీడేది లేదంటున్నాడు. ఐతే ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఉక్రెయిన్ లో చిక్కుకున్న డాక్టర్ గిరి కుమార్‌ను ఉద్దేశిస్తూ తాజాగా ట్విటర్‌ ద్వారా స్పందించారు. చిరంజీవి పోస్ట్‌ చేసిన ట్వీట్‌లో ఈ విధంగా పేర్కొన్నారు.. ‘ప్రియమైన గిరి కుమార్‌.. నా నుంచి ప్రేరణ పొంది.. జాగ్వార్స్ (Jaguar), పాంథర్‌ (panther)లను పెంచుకుంటున్నారని తెలిసి చాలా సంతోషిస్తున్నాను. ఈ దురదృష్టకర యుద్ధ సమయంలో కూడా మీ పెంపుడు జంతువులపై మమకారంతో ఉక్రెయిన్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మూగజీవాలపై మీకున్న మమకారం ప్రశంసనీయం. ఈ క్లిష్ట సమయంలో మీరు అక్కడ భద్రంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. త్వరలో యుద్ధం ముగిసి సాధారణ స్థితికి చేరుకోవాలని కోరుకుంటున్నారు. గాడ్ బ్లెస్!..’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

కాగా ఏపీలోని తణుకుకు చెందిన కుమార్ ఉక్రెయిన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. యూట్యూబ్‌లో జాగ్వార్ కుమార్‌గా అతడు సురిచితుడే. అతడికి పులులంటే అమితమైన ఇష్టం. లంకేశ్వరుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చిరుతను పెంచుకోవడం చూసిన కుమార్.. తాను కూడా పులిని పెంచుకోవాలని భావించాడు. ఉక్రెయిన్ వెళ్లిన తర్వాత అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఓ బుల్లి పులిపిల్లను తెచ్చుకున్నాడు. అది కూడా కుమార్‌కు బాగా దగ్గరైంది. ఐతే తాజా యుద్ధం అసలు సమస్యగా మారింది. ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో తాను నివసించే ప్రాంతంలోని వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కానీ కుమార్ మాత్రం జాగ్వార్‌తో కలిసి బంకర్‌లోనే ఉంటున్నాడు. ప్రాణాల మీదకు వచ్చినా, తాను పెంచుకుంటున్న పులికోసం కదిలేది లేదంటున్నాడు. కాగా అతను గ‌త 19 నెల‌లుగా ఈ పులిని పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం యుద్దం జ‌రుగుతున్న ప్రాంతంలో తాను ఒక్కడినే ఉన్నాన‌ని, తాను ఉంటున్న ప్రాంతంలో ప్రజ‌లంద‌రూ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయార‌ని తెలిపాడు. మూగజీవాలపై కుమార్‌ ప్రేమ అజరామరం.

Also Read:

Maruti Holi Offers 2022: కారు కొనుగోలుదర్లకు బంపరాఫర్‌! మారుతీ కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటన..