Donald Trump: ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో ఇంజిన్ ఫెయిల్.. తృటిలో తప్పించుకున్న మాజీ అధ్యక్షుడు..
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక(Technical Issue) లోపం తలెత్తింది.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక(Technical Issue) లోపం తలెత్తడంతో అత్యవరసరంగా ఓర్లియాన్స్ అధికారులు దానిని ల్యాండ్ చేశారు. మెక్సికో గగనతలం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్ పనిచేయటం ఆగిపోవటం వల్ల అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గతవాతం జరిగినప్పటికీ విషయం తాజాగా బయటకు వచ్చింది.
ట్రంప్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయాన్ని పొలిటికో అనే వార్తా సంస్థ ముందుగా ప్రచురించింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి సైతం ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను భద్రతా కారణాల రీత్యా వెల్లడించలేదు. న్యూ ఓర్లియాన్స్లో గత శనివారం జరిగిన రిపబ్లికన్ నేషనల్ కమిటీ డోనార్ రిట్రీట్‌కు హాజరై.. తిరిగి ఫ్లోరిడా ఎస్టేట్‌కు వస్తున్న క్రమంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంజిన్ఆగిపోయింది. న్యూ ఓర్లియన్స్ లేక్‌ఫ్రంట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలు దేరిన సుమారు 120 కిలోమీటర్లు గగనతంలో ప్రయాణించిన తరువాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఒక ఇంజిన్ మెురాయించింది. ఆ సమయంలో ట్రంప్ తో పాటు ఆయన సలహాదారులు, మరికొందరు నిఘా అధికారులు ఆ విమానంలో ఉన్నారు.
ఇవీ చదవండి..
Viral Photo: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ గా మారిన రతన్ టాటా పోస్ట్
Fixed Deposits: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు