Tax Saving: వాటిలో సేఫ్ పెట్టుబడి పెట్టండి.. లక్షన్నర టాక్స్ మినహాయింపు కొట్టేయండి..

Tax Saving: పన్ను మినహాయింపు పెట్టుబడులకోసం వెతికే ఇన్వెస్టర్లకు(Investors) మార్కెట్లో చాలా పరిమితమైన మార్గాలు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

Tax Saving: వాటిలో సేఫ్ పెట్టుబడి పెట్టండి.. లక్షన్నర టాక్స్ మినహాయింపు కొట్టేయండి..
Tax Saving
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 10, 2022 | 9:03 AM

Tax Saving: పన్ను మినహాయింపు పెట్టుబడులకోసం వెతికే ఇన్వెస్టర్లకు(Investors) మార్కెట్లో చాలా పరిమితమైన మార్గాలు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో అవి మంచి ఆదాయాన్ని కూడా ఇస్తుంటాయి. ఇటువంటి పెట్టుబడుల కోవకు చెందినవే టాక్స్ సేవింగ్ ఫిక్స్ డ్ డిపాజిట్లు(Tax saving FDs). వీటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్- 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ టాక్స్ స్కీమ్ కింద పెట్టుబడిదారులు తమ సొమ్మును కనీసం 5 సంవత్సరాల పాటు ఎఫ్ డి లో ఉంచాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల సదరు మదుపరులకు గరిష్ఠంగా రూ. 1.50 లక్షలు పన్ను మినహాయింపు రూపంలో లభిస్తుంది.

మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న ఇతర టాక్స్ సేవింగ్ పెట్టుబడులకు ఇది భిన్నమైనది. ఎందుకంటే ఎఫ్ డి లో పెట్టే సొమ్ముకు కచ్చితంగా రాబడి ఉంటుంది. మిగిలిన పెట్టుబడుల్లో అలాంటి గ్యారెంటీ ఏమీ ఉండదు. అందులోనూ వీటిలో చేసే పెట్టుబడులకు రిస్క్ చాలా తక్కువ. అందుకే వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు.. దేశంలోని టాక్స్ పేయర్స్ ఎక్కువగా దీనిని ఎంచుకునేందుకు మక్కువ చూపుతుంటారు. ఇలాంటి స్కీమ్స్ లో వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లు వేరువేరుగా నిర్ణయిస్తుంటాయి. చాలా బ్యాంకులు సాధారణంగా క్యుములేటివ్ లేదా నాన్-క్యుములేటివ్ పన్ను ఆదా FDలను అందిస్తాయి. వీటిలో కేవలం వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు అర్హత కలిగి ఉన్నాయి.

ఈ డిపాజిట్లను అందిస్తున్న బ్యాంకులు.

Indusind Bank – 6.5%

RBL Bank – 6.3%

IDFC First Bank – 6.25%

DCB Bank – 5.95%

Karur Vysya Bank – 5.9%

ఇవీ చదవండి..

Axis Bank Jobs: మహిళలకు శుభవార్త.. పట్టణాలోని వారికి ప్రత్యేకంగా బ్యాంక్ ఉద్యోగాలు..

Multibagger Penny Stocks: రూ. లక్షను.. రూ. 2 కోట్లు చేసిన స్టాక్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట..