US On Crypto Currencies: క్రిప్టో కరెన్సీలపై అమెరికా కీలక నిర్ణయం.. అలా రష్యాకు చెక్ పెట్టేందుకేనా..? పూర్తి వివరాలు..
US On Crypto Currencies: క్రిప్టో కరెన్సీల విషయంలో యూఎస్.. భారత ప్రభుత్వాన్ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ జొ బైడెన్(Joe Biden) బుధవారం క్రిప్టోకరెన్సీపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
US On Crypto Currencies: క్రిప్టో కరెన్సీల విషయంలో యూఎస్.. భారత ప్రభుత్వాన్ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ జొ బైడెన్(Joe Biden) బుధవారం క్రిప్టోకరెన్సీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రిప్టోలపై ప్రభుత్వ పర్యవేక్షణకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై(Executive order) సంతకం చేశారు. దీని ద్వారా అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు సొంతగా ప్రత్యేక డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు వీలుగా దీనిని రూపకల్పన చేశారు. ప్రజల్లో క్రిప్టోలపై రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ కారణంగా వాటిలో ఉండే రిస్క్, లాభాల గురించి అధ్యయనం చేసేందుకు ఈ నిర్ణయం కీలకంగా మారనుందని తెలుస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఈ డిజిటల్ కరెన్సీల ప్రభావం ఎంతవరకు ఉంటుందనే విషయాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ట్రెజరీ, ఫెడరల్ ఏజెన్సీలను ఆదేశించింది. క్రిప్టోల వల్ల ఆర్థిక అస్థిరత, దేశ భద్రతకు వాటిల్లే ముప్పు విషయాలపై ఈ ఏజెన్సీలు విశ్లేషించనున్నాయి.
ఇటువంటి చర్యల కారణంగా ఈ డిజిటల్ ఆస్తుల వ్యవహారంలో అగ్రరాజ్యం కీలకంగా మారేందుకు ఉపకరిస్తుందని తెలుస్తోంది. దీని వల్ల పెట్టుబడులు పెట్టేవారికి భద్రత కూడా లభించనుంది. రష్యా తనపై ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఈ క్రిప్టో కరెన్సీలను వినియోగించే అవకాశం ఉందని అనేక మంది లేవనెత్తుతున్న అనుమానాల కారణంగా యూఎస్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలోని బ్యాంకులు, ఒలిగార్కులు, చమురు రంగాలను వీటిని వినియోగించి రక్షించుకోవచ్చని వారు అంటున్నారు. అమెరికా విధించిన ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు క్రిప్టోలు ఉపకరించవని జొ బైడెన్ సిఎన్ఎన్ వార్తా సంస్థతో తెలిపారు.
క్రిప్టోకరెన్సీకి మారడం ద్వారా US, యూరోపియన్ వ్యాపారాల నుంచి వచ్చే నష్టాన్ని రష్యా భర్తీ చేయలేదని బైడెన్ ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత నెలలో ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రారంభించటానికి కొన్ని నెలల ముందుగానే డెమొక్రాట్లు దీనిని రూపకప్పన చేసే పనిలో ఉన్నారు.
ఇవీ చదవండి..
Axis Bank Jobs: మహిళలకు శుభవార్త.. పట్టణాలోని వారికి ప్రత్యేకంగా బ్యాంక్ ఉద్యోగాలు..
Multibagger Penny Stocks: రూ. లక్షను.. రూ. 2 కోట్లు చేసిన స్టాక్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట..