Petrol-Diesel Price Today: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయా…? తాజాగా ఏ నగరంలో ఎంత..?

Petrol-Diesel Price Today: ఉత్తరప్రదేశ్‌తో సహా దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నేడు ఫలితాలు వెలవడనున్నాయి. ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు..

Petrol-Diesel Price Today: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయా...? తాజాగా ఏ నగరంలో ఎంత..?
Petrol Diesel Price
Follow us
Subhash Goud

|

Updated on: Mar 10, 2022 | 8:19 AM

Petrol-Diesel Price Today: ఉత్తరప్రదేశ్‌తో సహా దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నేడు ఫలితాలు వెలవడనున్నాయి. ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol,Diesel Rate) భారీగా పెరిగే అవకాశం ఉందని ఇది వరకు వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్‌ – రష్యా (Ukraine-Russia) మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ధరలు భారీగా మండిపోనున్నాయి. ఇక గత ఏడాది నవంబర్‌ నుంచి దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధాలు ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వాస్తవానికి ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్‌ (International Markets)లో ముడి చమురు ధరలు పెరిగిపోయాయి. గత రెండు నెలల్లో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ రిటైలర్లు ఆ ధరను రికవరీ చేసేందుకు ధరలను అమాంతంగా పెంచేశారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ దేశీయ మార్కెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మారలేదు. ఇండియన్‌ పెట్రోలియం మార్కెటింగ్‌ కంపెనీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOCL) అప్‌డేట్స్‌ ప్రకారం.. దేశీయంగా మార్చి 10న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.95.41 ఉండగా, డీజిల్‌ ధర రూ.86.67గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.98 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.14గా ఉంది. ఇక చెన్నైలో లీటర్‌ పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా, డీజిల్ ధర రూ. 91.43గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104.67 ఉండగా, డీజిల్‌ ధర రూ.89.79 ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.20 ఉండగా, డీజిల్‌ ధర రూ. 94.62వద్ద కొనసాగుతోంది. ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం సంస్థలు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సవరిస్తుంటాయి.

ప్రతి నగరంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలలో తేడా రావడానికి పన్నులే కారణం. వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను వసూలు చేస్తాయి. విధించే పన్ను ఆధారంగా రాష్ట్రాల్లో, నగరాల్లో ధరల్లో కొంత తేడా కనిపిస్తుంటుంది.

ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కూడా SMS ద్వారా తెలుసుకోవచ్చు. మీ మొబైల్‌ నుంచి 9224992249 నెంబర్‌కు SMS పంపాలి. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్‌ (Message) పపితే ధరల వివరాలు వస్తాయి.

ఇవి కూడా చదవండి:

Whatsapp: వాట్సాప్‌ ద్వారా బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను ఎలా చెక్‌ చేయాలి..? సులభమైన మార్గాలు

330 పెట్టుబడిపై 2 లక్షల ప్రయోజనం.. కానీ ఈ వయసు వారికి మాత్రమే..!