AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి చేసుకుంటే 2.5 లక్షల ప్రయోజనం.. కానీ అది ఇలా జరిగితేనే..!

Inter Caste Marriage: వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు జరగాల్సిందే. ఇది సమాజంలో చాలా పవిత్రమైన బంధంగా పరిగణిస్తారు. అయితే మారుతున్న

పెళ్లి చేసుకుంటే 2.5 లక్షల ప్రయోజనం.. కానీ అది ఇలా జరిగితేనే..!
Marriage
uppula Raju
|

Updated on: Mar 10, 2022 | 7:50 AM

Share

Inter Caste Marriage: వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు జరగాల్సిందే. ఇది సమాజంలో చాలా పవిత్రమైన బంధంగా పరిగణిస్తారు. అయితే మారుతున్న కాలంతో పాటు సమాజంలో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేటికీ చాలా మంది కులాంతర వివాహాలు చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అందుకే ఇలాంటి వివాహాలకు సమాజంలో ఆదరణ తక్కువ. ఇలాంటి వివాహాలు చేసుకున్నవారు నష్టపోకుండా, వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తుంది. దాని పేరు డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్. ఈ ప్రభుత్వ పథకం కింద కొత్తగా పెళ్లయిన దంపతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ఇది వారి ఆర్థిక స్థితిని మార్చడానికి, సామాజిక ఆలోచనను మార్చడానికి సహాయపడుతుంది. కానీ ఈ ప్లాన్ కింద లబ్ధి పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ అంటే ఏమిటి?

డా. అంబేద్కర్ ఫౌండేషన్ ఈ పథకం కింద కులాంతర వివాహాలు చేసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకానికి డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ పేరు పెట్టారు.ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి అమ్మాయి వయస్సు కనీసం 18, అబ్బాయి వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. దీంతో పాటు వారిలో ఒకరు దళిత వర్గానికి చెందిన వారై ఉండాలి. మరొకరు ఇతర వర్గానికి చెందని వారై ఉండాలి. దీంతో అబ్బాయి, అమ్మాయి హిందూ వివాహ చట్టం 1955 కింద తమ వివాహాన్ని నమోదు చేసుకోవాలి. ఇద్దరూ దళిత వర్గానికి చెందిన వారైనా లేదా వేరే వర్గానికి చెందినవారైనా వారు ఈ ప్రయోజనం పొందలేరు. కచ్చితంగా ఒకరు దళిత వర్గం మరొకరు వేరే వర్గానికి చెందిన వారై ఉండాలి.

ఈ వ్యక్తులు అర్హులు కాదు

మొదటిసారి వివాహం చేసుకున్న జంటలు మాత్రమే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోగలరు. భార్య లేదా భర్త రెండో వివాహం చేసుకున్న సందర్భంలో ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు. వారి వివాహాన్ని నమోదు చేసుకున్న తర్వాత కొత్తగా పెళ్లయిన జంట మీ వివాహ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. తర్వాత కపుల్ డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం ప్రయోజనం వివాహం అయిన ఒక సంవత్సరంలోపు మాత్రమే పొందవచ్చని గుర్తుంచుకోండి.

Aadhaar: మీ ఆధార్ కార్డు సురక్షితమేనా.. సైబర్ నేరస్థులకి చిక్కొద్దంటే ఇలా చేయండి..!

330 పెట్టుబడిపై 2 లక్షల ప్రయోజనం.. కానీ ఈ వయసు వారికి మాత్రమే..!

బలహీనంగా ఉన్నవారికి ఈ 3 ఆయుర్వేద మందులు బెస్ట్‌.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ అస్సలు ఉండవు..!

కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో
నోట్లో వేయగానే కరిగిపోతుంది.. తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!
నోట్లో వేయగానే కరిగిపోతుంది.. తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!
ఒక్కసారి ఛార్జింగ్‌తో 110 కి.మీ రేంజ్‌.. ధర ఎంతో తెలుసా?
ఒక్కసారి ఛార్జింగ్‌తో 110 కి.మీ రేంజ్‌.. ధర ఎంతో తెలుసా?
రాజయోగం పట్టనుంది.. రాసిపెట్టుకోండి ఫిబ్రవరిలో ధనవంతులు వీరే
రాజయోగం పట్టనుంది.. రాసిపెట్టుకోండి ఫిబ్రవరిలో ధనవంతులు వీరే
ప్రేమంటే ఇదేరా.. రెండు హృదాయాలను కలిపే అద్భుతమైన కానుక..
ప్రేమంటే ఇదేరా.. రెండు హృదాయాలను కలిపే అద్భుతమైన కానుక..
మెట్రో స్టేషన్‌లో జంట ఎంగేజ్‌మెంట్‌.. గుక్కపట్టి ఏడ్చిన వరుడు!
మెట్రో స్టేషన్‌లో జంట ఎంగేజ్‌మెంట్‌.. గుక్కపట్టి ఏడ్చిన వరుడు!
నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను..
నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను..
ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?