Aadhaar: మీ ఆధార్ కార్డు సురక్షితమేనా.. సైబర్ నేరస్థులకి చిక్కొద్దంటే ఇలా చేయండి..!
Aadhaar: భారతదేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన పత్రమో అందరికి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆధార్ వినియోగం చాలా వేగంగా పెరిగిపోయింది. దాదాపు ప్రతిచోటా
Aadhaar: భారతదేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన పత్రమో అందరికి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆధార్ వినియోగం చాలా వేగంగా పెరిగిపోయింది. దాదాపు ప్రతిచోటా ఆధార్ కార్డునే గుర్తింపు కార్డుగా వినియోగిస్తున్నారు. వాస్తవానికి మన బయోమెట్రిక్ సమాచారం, ఐరిస్ సమాచారం ఆధార్ కార్డులో నమోదై ఉంటుంది. ఈ సందర్భంలో ఇది అన్ని ఇతర పత్రాల కంటే చాలా ప్రత్యేకం. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు ఆధార్ కార్డు సమాచారాన్ని తస్కరించి పలు మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే UIDAI (ఆధార్ కార్డును జారీ చేసే సంస్థ) ఆధార్‌ను లాక్, ఆన్‌లాక్ చేసే సదుపాయాన్ని కల్పించింది. ఇది మీ బయోమెట్రిక్ వివరాలు దుర్వినియోగం కాకుండా కాపాడుతుంది. బయోమెట్రిక్‌ను లాక్ చేయడం ద్వారా మీ డేటా సేఫ్‌గా ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డ్ బయోమెట్రిక్‌ను ఎలా లాక్ మరియు ఆన్‌లాక్ చేయాలో తెలుసుకుందాం.
ఆధార్ డేటా లాక్ ఎలా చేయాలి…?
1. ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడానికి ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌పై క్లిక్ చేయాలి.
2. తర్వాత My Aadhaar ఎంపికను ఎంచుకోవాలి.
3. ఇందులో మీరు ఆధార్ లాక్ లేదా ఆన్‌లాక్ ఎంపికపై క్లిక్ చేయాలి.
4. తర్వాత మీరు ఆధార్ కార్డ్, క్యాప్చాను ఎంటర్ చేయాలి.
5. తర్వాత మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
6. ఆ తర్వాత OTPని కూడా ఎంటర్ చేయాలి.
7. ఓకే బటన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీ ఆధార్ లాక్ అవుతుంది.
ఆధార్ ఆన్‌లాక్ ఎలా చేయాలి..?
1. ఆధార్ ఆన్‌లాక్ చేయడానికి మీరు పై క్లిక్ చేయాలి.
2. ఇప్పుడు మీరు My Aadhaar ఎంపికను ఎంచుకోవాలి.
3. తర్వాత అన్‌లాక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
4. తర్వాత OTPని ఎంటర్ చేసి ఆధార్‌ను అన్‌లాక్ చేయాలి.