AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 3 రాశుల అమ్మాయిలు భర్తల విజయంలో పెద్ద పాత్ర పోషిస్తారు..!

Zodiac Signs: జ్యోతిష్యం ప్రకారం రాశులని బట్టి ఒక వ్యక్తి స్వభావం, భవిష్యత్తు అంచనా వేయవచ్చు. ప్రతి రాశికి దానికంటూసొంత స్వభావం ఉంటుంది.

Zodiac Signs: ఈ 3 రాశుల అమ్మాయిలు భర్తల విజయంలో పెద్ద పాత్ర పోషిస్తారు..!
uppula Raju
|

Updated on: Mar 09, 2022 | 8:30 PM

Share

Zodiac Signs: జ్యోతిష్యం ప్రకారం రాశులని బట్టి ఒక వ్యక్తి స్వభావం, భవిష్యత్తు అంచనా వేయవచ్చు. ప్రతి రాశికి దానికంటూసొంత స్వభావం ఉంటుంది. ఈ రాశులలో గ్రహాలు బలంగా లేదా శుభప్రదంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తులు విజయాన్ని సాధించడమే కాకుండా జీవిత భాగస్వామి అదృష్టాన్ని కూడా మార్చేస్తారు. అలాంటి రాశుల గురించి తెలుసుకుందాం. అందులో మొదటగా వృషభరాశి మహిళల గురించి చెప్పుకోవాలి. రాశులలో వృషభం రెండో రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయిలు తమ జీవిత భాగస్వామి విధిని మార్చేస్తారు. దీనివల్ల భాగస్వామి అన్ని పనులలో విజయం సాధిస్తాడు. వీరి సహకారం వల్ల ధనలాభం, విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులు మంచి అభివృద్ధి సాధిస్తారు.

కన్యరాశి

12 రాశులలో కన్యరాశికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ రాశి మహిళలు చాలా సున్నితమైనవారు. కానీ చాలా పరిణతి చెంది ఉంటారు. వీరు ప్రతి పనిని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. కన్యరాశి అమ్మాయిలు మంచి భార్య, కోడలు, తల్లిగా ఉండటానికి చాలా కష్టపడతారు. కన్యారాశి జాతకంలో శుభ గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు వారి స్థానం శుభ యోగాన్ని సృష్టిస్తుంది. ఈ రాశికి చెందిన అమ్మాయిలు జీవిత భాగస్వామి విజయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఆనందం, దురదృష్టంలో కలిసి ఉంటారు. చెడు సమయాల్లో కూడా ఆమె తెలివిగా జీవిత భాగస్వామికి మద్దతు ఇస్తుంది.

మకరరాశి

మకరరాశి అమ్మాయిలు అనుకున్నది సాధిస్తారు. ఏ పనిని మధ్యలో విడిచిపెట్టరు. ఈ స్వభావం ఆమె జీవిత భాగస్వామికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మకర రాశికి అధిపతి శని దేవుడు. శని కర్మాధిపతిగా వ్యవహరిస్తారు. శని శుభంగా ఉన్నప్పుడు అలాంటి అమ్మాయిలు జీవిత భాగస్వామి విజయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారు ప్రతి సందర్భంలోనూ ఖచ్చితమైన సలహాలను అందిస్తారు. చెడు సమయాల్లో కూడా సహనం కోల్పోరు. తమ బాధ్యతలను చాలా సీరియస్‌గా తీసుకుంటారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిష్యంపై ఆధారపడి ఉంటుంది. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే రాయడం జరిగింది.

Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్లలోకి పెట్టుబడుల ప్రవాహం.. ఫిబ్రవరిలో రూ.19,705 కోట్ల పెట్టుబడి..

Vitamin C Deficiency: విటమిన్ సి లోపం ఉంటే మీరు ప్రమాదంలో ఉన్నట్టే.. ఈ వ్యాధులు రావడం పక్కా..

Telugu movies: ఈ వారం థియేటర్, ఓటీటీలలో విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్ ఇదిగో…