Vitamin C Deficiency: విటమిన్ సి లోపం ఉంటే మీరు ప్రమాదంలో ఉన్నట్టే.. ఈ వ్యాధులు రావడం పక్కా..

మనం ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్స్, ఖనిజాలు... ప్రోటీన్స్ చాలా ముఖ్యం. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఆరోగ్యంగా.

Vitamin C Deficiency: విటమిన్ సి లోపం ఉంటే మీరు ప్రమాదంలో ఉన్నట్టే.. ఈ వ్యాధులు రావడం పక్కా..
Vitamin C
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 09, 2022 | 7:34 PM

మనం ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్స్, ఖనిజాలు… ప్రోటీన్స్ చాలా ముఖ్యం. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఆరోగ్యంగా.. ఉత్సాహంగా ఉండేందుకు సహయపడతాయి. అందులో ముఖ్యంగా విటమిన్ సి. ఇది శరీరంలో కొల్లాజెన్‏ను ఉత్పత్తి చేస్తుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. రక్త నాళాలు.. గాయలను నయం చేయడంలోనూ సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ సి లోపం ఉంటే అనేక రకాల సమస్యలు వస్తాయి..

నివేదికల ప్రకారం శరీరంలో విటమిన్ సి లోపం ఉంటే.. స్కర్వీ వ్యాధీ వచ్చే అవకాశం ఉంది. దీంతో చిగుళ్లలో రక్తస్రావం.. చిగుళ్లు వాపు.. దంతాలు ఊడిపోవడం.. అలసట, బలహీనత, దద్దుర్లు మొదలైనవి ఏర్పడతాయి. అంతేకాకుండా.. ఆకలి లేకపోవడం.. చికాకు.. కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే స్కర్వీ రక్తహీనత, చిగుళ్లు వాపు.. చర్మం నుంచి రక్తస్రావం మొదలైన సమస్యలు వస్తాయి. ఆహారంలో విటమిన్ సి లేకపోతే హైపర్ థైరాయిడిజం సమస్య వస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంధి సమస్య. ఈ థైరాయిడ్ గ్రంథి ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు విటమిన్ సి చాలా ముఖ్యం. హైపర్ థైరాయిడిజం లక్షణాలు.. పీరియడ్స్ సమస్యలు, బరువు తగ్గడం.. గుండె వేగం.. ఆకలి పెరగడం.. భయము.. వణుకు మొదలైనవి కలుగుతాయి.

విటమిన్ సి శరీరంలోని ఐరన్ ను గ్రహిస్తుంది. ఇది రక్తహీనత వ్యాధిని కలిగించదు. శరీరంలో ఎర్ర రక్తకణాలు లేకపోవడం వలన రక్తహీనత వస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం.. అలసట, తల తిరగడం, చర్మం పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలు కలుగుతాయి. విటమిన్ సి లోపం వలన శరీరంలో అనేక సమస్యలు కలుగుతాయి. దీంతో చర్మ వ్యాధులు వస్తాయి. విటమిన్ దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే చర్మ సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్ సిలో యాంటి ఆక్సిడెంట్స్ ఎలిమెంట్స్ కొల్లాజెన్ ను తయారు చేస్తాయి. కీళ్ల ఆరోగ్యానికి చాలా అవసరం.

విటమిన్ సి లోపాన్న తగ్గించడానికి సిట్రస్ పండ్లను తీసుకోవడం చాలా ముఖ్యం. ఆలాగే ఆకుపచ్చని కూరగాయలను తీసుకోవాలి. నారింజ, నిమ్మ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, బ్రకోలీ, బంగాళదుంపలు, సిట్రస్ పండ్లు తీసుకోవడం వలన విటమిన్ సి లోపాన్ని తగ్గించవచ్చు.

గమనిక: – ఈ కథనం కేవలం నిపుణుల సూచనల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. సందేహాల కోసం వైద్యులను సంప్రదించాలి.

Also Read: Pooja Hegde: ప్రభాస్..పూజా హెగ్డే మధ్య గొడవలు.. అసలు విషయం చెప్పేసిన టాలీవుడ్ బుట్టబొమ్మ..

Malavika Mohanan: ఆ వార్తలు బాధను కలిగిస్తాయి.. అయినా మంచి అనుభవమే.. షాకింగ్ కామెంట్స్ చేసిన మాళవిక..

Rajamouli: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర ట్వీట్స్.. ఏమన్నారంటే..

Poonam Kaur: పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్.. దర్శకుడు రాక్షసంగా ప్రవర్తించాడంటూ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే