Weight Loss Liquid Diet: షేన్ వార్న్ మరణానికి ‘లిక్విడ్ డైట్’ కారణమా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Shane Warne Death Cause: బరువు తగ్గేందుకు లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నారా.. అయితే, కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. లేదంటే తీవ్ర ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. అసలు ఇది ఎంత వరకు ఉపయోగకరమో ఇప్పుడు తెలుసుకుందాం.

Weight Loss Liquid Diet: షేన్ వార్న్ మరణానికి 'లిక్విడ్ డైట్' కారణమా.. నిపుణులు ఏమంటున్నారంటే?
Shane Warne Weight Loss Liquid Diet
Follow us

|

Updated on: Mar 09, 2022 | 6:59 PM

Shane Warne Death Reason: ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ మృతితో క్రికెట్ ప్రేమికులు ఇంకా షాక్‌లోనే ఉన్నారు. 52 ఏళ్ల ఈ ఆస్ట్రేలియా దిగ్గజం అనుమానాస్పద గుండెపోటు(Heart Attack)తో ఈ వారం మరణించిన సంగతి తెలిసిందే. అతను ప్రపంచంలోనే గొప్ప స్పిన్నర్‌గా పేరుగాంచాడు. ఆయన మరణించిన కొద్ది రోజులకే ఇప్పుడు షాకింగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. షేన్ వార్న్(Shane Warne) బరువు తగ్గడానికి ‘లిక్విడ్ డైట్’ తీసుకుంటున్నట్లు ఫిబ్రవరి 28న సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. బరువు తగ్గేందుకు లిక్విడ్ డైట్ సరైనదేనా, దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. షేన్ వార్న్ 14 రోజులుగా విపరీతమైన లిక్విడ్ డైట్‌(Liquid Diet) లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇది అతని మరణానికి కారణం కావచ్చనే వార్తలు వస్తున్నాయి. వార్న్ కొద్దిరోజుల క్రితం వరకు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నాడని, ఇందుకోసం లిక్విడ్ డైట్ ఫాలో అయ్యాడని చెబుతున్నారు.

బరువు, ఫిట్‌నెస్, డైట్‌కి సంబంధించిన పోస్ట్‌ను గత వారం సోషల్ మీడియాలో పంచుకుంటూ, ‘ఆపరేషన్ ష్రెడ్ మొదలైంది(10 రోజుల్లో). జులై నాటికి తిరిగి ఫిట్‌గా తయారవుతా’ అంటూ పేర్కొన్నాడు. వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కిన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వార్న్ ఒక రకమైన డైట్ ప్లాన్‌ను అనుసరిస్తున్నాడు. ఈమేరకు 14 రోజుల పాటు ద్రవపదార్థాలు మాత్రమే తీసుకున్నాడు’ అని తెలిపాడు.

లిక్విడ్ డైట్‌లో వార్న్ ఏం తీసుకున్నాడు?

వార్న్ చాలా తక్కువ తింటున్నాడని అతని మేనేజర్ తెలిపాడు. అతని ఆహారంలో తెల్లటి బన్‌ను వెన్నతో తీసుకుంటున్నాడు. వీటితోపాటు నలుపు, ఆకుపచ్చ రసాలు ఉన్నాయి. అయితే, గతంలో షేన్ వార్న్ విపరీతంగా ధూమపానం చేసేవాడు. అది కూడా గుండెపోటుకు కారణం కావొచ్చు’ అని పేర్కొన్నాడు. తన తండ్రి 30 రోజుల ఫాస్టింగ్ టీ డైట్‌ని ఎందుకు తీసుకుంటాడో వార్న్ కొడుకు ప్రకటించాడు. వార్న్ తన మరణానికి కొన్ని రోజుల ముందు డైట్ ప్లాన్ పూర్తి చేశాడని, ఆ తర్వాత వెజిమైట్ టోస్ట్ తిన్నాడని నివేదికలు కూడా సూచించాయి.

లిక్విడ్ డైట్ అంటే ఏమిటి?

బరువు తగ్గాలనుకునే వారిలో ఈ లిక్విడ్ డైట్ ప్రసిద్ధి చెందింది. ఇందులో పానీయాల ద్వారా క్యాలరీలను కరిగించుకునే ప్రయత్నం చేస్తారు. బరువు తగ్గేందుకు లిక్విడ్ డైట్‌ని చాలామంది ఆశ్రయిస్తున్నారు. ఇందులో, సాధారణంగా పండ్లు, కూరగాయల నుంచి జ్యూస్ తీసుకుని తాగుతుంటారు. చాలా మంది వీటిని మూడు సార్లు కూడా తీసుకుంటుంటారు.

లిక్విడ్ డైట్ వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

అయితే, వార్న్ అకాల మరణానికి లిక్విడ్ డైట్ కారణమని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇలాంటి డైట్‌లు తీసుకునే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ కేలరీల తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

ఇలాంటి ఆహారం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇది గుండె ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుంది. సహజంగానే ద్రవ ఆహారం నుంచి అవసరమైన పోషకాలను పొందలేరు. తక్కువ కేలరీల ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సరైన సమతుల్యతను కలిగి ఉండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Also Read: Healthy Diet: ఎముకలు దృఢంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పనిసరి.. అవెంటంటే..

Healthy Foods: రోగనిరోధక శక్తిని పెరగాలంటే..? ఈ ఆహార పదార్థాలను తప్పనసరిగా డైట్‌లో చేర్చుకోండి

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..