Healthy Diet: ఎముకలు దృఢంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పనిసరి.. అవెంటంటే..

కరోనా సంక్షోభం అనంతరం అందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకుంటున్నారు. సాధ్యమైనంతవరకు జంక్ ఫుడ్.. బయటి ఆహారం తీసుకోవడం మానేసి

Healthy Diet: ఎముకలు దృఢంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పనిసరి.. అవెంటంటే..
Bones Health
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 09, 2022 | 6:41 PM

కరోనా సంక్షోభం అనంతరం అందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకుంటున్నారు. సాధ్యమైనంతవరకు జంక్ ఫుడ్.. బయటి ఆహారం తీసుకోవడం మానేసి.. ఇంటి భోజనాన్ని ఇష్టపడుతున్నారు. అలాగే.. పూర్వకాలం నాటి వంటకాలు.. ఆరోగ్యానికి మేలు చేసే ఇంటివంటను ఇష్టంగా తీసుకుంటున్నారు. అలాగే.. ఆరోగ్యాంగా ఉండేందుకు మంచి ఆహారం.. మంచి నిద్ర, రోజూ వ్యాయామం చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే కాదు… ఎముకలను దృఢంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే. అందుకు తగిన ఆహారాన్ని కూడా తీసుకోవాలి.

పోషకాహార నిపుణుడు భక్తి కపూర్ తెలిపిన ప్రకారం బలమైన ఎముకలు సమతుల్య ఆహారం.. ఆరోగ్యకరమైన జీవనశైలి పై ఆధారపడి ఉంటాయి. చిన్పప్పటి నుంచే సరైన ఆహారం తీసుకోవడం వలన వృద్ధాప్యంలో ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉండేందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలను మీ ప్రతిరోజూ తీసుకునే ఆహారంతో జతచేయాలని సూచించారు.

* బాదం * ఆకు కూరలు * కొవ్వు చేప * పెరుగు * ఆలివ్ నూనె * అరటిపండ్లు * నారింజలు * నువ్వులు * సోయా

ఫైటిక్ యాసిడ్ ఉన్నందున తృణధ్యాన్యాలలో కాల్షియం ఉండదు. ఇవి కాల్షియంను తగ్గిస్తాయి. అలాగే మటన్, చికెన్ వంటి మాంసాహారాలు ఎక్కువగా తినడం వలన శరీరంలో కాల్షియం తగ్గుతుంది. అందుకే సమతుల్యత ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే ఉప్పును ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. దీనివలన కాల్షియం ప్రభావం తగ్గిపోతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వలన బోలు ఎముకల వ్యాధి ప్రమాదం ఉంటుంది. అందుకే ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. టీ, కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియాన్ని తగ్గిస్తుంది. కాబట్టి టీ.. కాఫీ తీసుకోవడం కూడా తగ్గించాలి. అలాగే విటమిన్ డి పదార్థాలు.. సూర్యరశ్మిలో ఉండడం చాలా ముఖ్యమని తెలిపారు.

గమనిక: – ఈ కథనం కేవలం నిపుణుల సూచనల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. సందేహాల కోసం వైద్యులను సంప్రదించాలి.

Also Read: Pooja Hegde: ప్రభాస్..పూజా హెగ్డే మధ్య గొడవలు.. అసలు విషయం చెప్పేసిన టాలీవుడ్ బుట్టబొమ్మ..

Malavika Mohanan: ఆ వార్తలు బాధను కలిగిస్తాయి.. అయినా మంచి అనుభవమే.. షాకింగ్ కామెంట్స్ చేసిన మాళవిక..

Rajamouli: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర ట్వీట్స్.. ఏమన్నారంటే..

Poonam Kaur: పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్.. దర్శకుడు రాక్షసంగా ప్రవర్తించాడంటూ..