Fenugreeks Benefits: మెంతులతో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Weight Loss Tips: ఫిట్‌గా ఉండటానికి.. బరువు తగ్గడానికి శారీరక శ్రమతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, మీరు ఆహారంలో మెంతి గింజలను కూడా చేర్చుకోవచ్చు. ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో..
ఫిట్‌గా ఉండటానికి.. బరువు తగ్గడానికి శారీరక శ్రమతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, మీరు ఆహారంలో మెంతి గింజలను(Fenugreeks ) కూడా చేర్చుకోవచ్చు. ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను ఉపయోగిస్తుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ ఉపయోగిస్తాం. శతాబ్దాలుగా మెంతి గింజలను ఔషధంగా ఉపయోగిస్తున్నారు. వీటిలో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ , డి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విత్తనాలను సరిగ్గా తీసుకుంటే, అవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. మెంతి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించడంలో సహాయపడతాయి. ఈ సూపర్‌ఫుడ్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అవి జీవక్రియను వేగవంతం చేస్తాయి.
మెంతి వాటర్..
ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. దీన్ని ఫిల్టర్ చేసి ఖాళీ కడుపుతో తినండి.
మెంతి టీ
మెంతి టీ తయారు చేయడానికి.. మీకు ఒక చెంచా మెంతి గింజలు, దాల్చిన చెక్క , అల్లం అవసరం. ఒక సాస్పాన్లో నీటిని మరిగించి, దానికి మూడు పదార్థాలను జోడించండి. దీన్ని తయారు చేయడానికి 5 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది. ఈ టీ బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది. అల్లం, దాల్చినచెక్క రెండింటిలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మొలికెత్తిన మెంతి గింజలు
మీరు మొలకెత్తిన మెంతి గింజలను కూడా తినవచ్చు. దీని కోసం, రెండు చెంచాల మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఈ మొలకెత్తిన మెంతి గింజలను ఉదయాన్నే తినండి. మీరు ఖాళీ కడుపుతో కూడా తినవచ్చు. ఇది కాకుండా, మీరు వాటిని భోజనాల మధ్య కూడా తినవచ్చు.
మెంతులు, తేనె పేస్ట్
బరువు తగ్గడానికి మెంతి గింజలు, తేనె పేస్ట్ కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం మెంతి గింజలను మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులో తేనె మిక్స్ చేసి తినాలి. అంతే కాకుండా ఈ మెంతి పొడిని కూడా నీటిలో వేసి మరిగించవచ్చు. దీని తరువాత, తేనె , నిమ్మరసం కలిపి హెర్బల్ టీగా తీసుకోవచ్చు. తేనెలో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో బి విటమిన్లు, కాల్షియం, జింక్, ఐరన్ , కాపర్ మొదలైనవి ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
ఇవి కూడా చదవండి: Eyes Care Tips: కళ్లల్లో మంట, దురదతో ఇబ్బంది పడుతున్నారా? ఈ హోం రెమెడీస్‌ని అనుసరించండి..
Russia Ukraine War Live: ఉక్రేనియన్ సైన్యం చేతిలో మరో రష్యన్ సైనికాధికారి మృతి