Paris Gare de Lyon: ఓ బ్యాగ్ ఎఫెక్ట్.. అతి రైల్వే స్టేషన్ క్షణాల్లో ఖాళీ.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Paris Gare de Lyon : ఓ బ్యాగ్ ఎఫెక్ట్.. ఓ రైల్వే స్టేషన్ మొత్తం ఖాళీ అయ్యింది. భద్రతా దళాలు ఆ స్టేషన్ అంతటినీ స్వాధీనం చేసుకుని, అణువణువు జల్లెడ పట్టారు.
Paris Gare de Lyon : ఓ బ్యాగ్ ఎఫెక్ట్.. ఓ రైల్వే స్టేషన్ మొత్తం ఖాళీ అయ్యింది. భద్రతా దళాలు ఆ స్టేషన్ అంతటినీ స్వాధీనం చేసుకుని, అణువణువు జల్లెడ పట్టారు. స్టేషన్ పరిసరాల్లో ఒక్కరిని కూడా ఉండకుండా జాగ్రత్త పడ్డారు. ఇంతకీ ఏం జరిగింది? ఏ రైల్వేషన్? ఏం బ్యాగ్..? పూర్తి వివరాల్లోకెళితే.. పారీస్‌లోని ఆరు అతిపెద్ద రైల్వే స్టేషన్లలో గారే డి లియోన్ రైల్వే స్టేషన్ ఒకటి. అయితే, ఆ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పద వస్తువు ఒకటి కనిపించడంతో స్టేషన్ అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే సమాచారాన్ని భద్రతా సిబ్బందికి అందించారు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది.. రైల్వే స్టేషన్ మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.
గారే డి లియోన్ రైల్వే స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు, స్టేషన్ సిబ్బంది సహా అందరినీ ఖాళీ చేయించారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్‌లను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. పొరపాటున అది పేలుడు పదార్థాలతో కూడినది అయితే, పెను ప్రమాదం తప్పదని భావించి.. స్టేషన్‌ను ముందస్తుగా ఖాళీ చేయించారు అధికారులు. అలాగే ఆ స్టేషన్‌కు రైళ్ల రాకపోకలను సైతం నిలిపివేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
JUST IN – The Paris Gare de Lyon evacuated after reports of a suspicious baggage.
— Insider Paper (@TheInsiderPaper) November 26, 2021
Also read:
గ్యాస్ సమస్య తరచూ వేధిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?
Rainfall: దక్షిణ భారతదేశంలో వర్షాల బీభత్సం.. ఒక్క నవంబర్‌లోనే 143.4 శాతం వానలు..
Corona Effect: వారి కుటుంబాల పునరావసం కోసం దాఖలైన పిటిషన్ పై కేంద్ర స్పందన కోరిన సుప్రీం కోర్టు