Corona Effect: వారి కుటుంబాల పునరావసం కోసం దాఖలైన పిటిషన్ పై కేంద్ర స్పందన కోరిన సుప్రీం కోర్టు

కోవిడ్-19 మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు జాతీయ ప్రణాళికను సిద్ధం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రం అదేవిధంగా అన్ని రాష్ట్రాల ప్రతిస్పందనను కోరింది.

Corona Effect: వారి కుటుంబాల పునరావసం కోసం దాఖలైన పిటిషన్ పై కేంద్ర స్పందన కోరిన సుప్రీం కోర్టు
Supreme Court
Follow us
KVD Varma

|

Updated on: Nov 26, 2021 | 10:11 PM

Corona Effect: కోవిడ్-19 మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు జాతీయ ప్రణాళికను సిద్ధం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రం అదేవిధంగా అన్ని రాష్ట్రాల ప్రతిస్పందనను కోరింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం సుధీర్ కథ్‌పాలియా దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు విద్యా రుసుము మాఫీ చేయాలని పిటిషన్‌లో కోరారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది రాజేష్ కుమార్ చౌరాసియా, కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లలు లేదా ప్రాణాంతక వైరస్ కారణంగా సంపాదించే సభ్యులు మరణించిన కుటుంబాల బాధలను తగ్గించడానికి ఎటువంటి పథకం లేదని పేర్కొన్నారు.

సమాధానం 6 వారాల్లో ఇవ్వండి..

ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. “తల్లిదండ్రుల అకాల మరణం కారణంగా పిల్లలు అనాథలుగా మారుతున్నట్లు నివేదికలు ఉన్నాయి. కుటుంబాల కష్టాలను తగ్గించడానికి, అనాథ పిల్లల మొత్తం సంక్షేమం కోసం రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి” అని పిటిషన్‌లో పేర్కొంది.

గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది

గతంలో, గుజరాత్‌లో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది. బాధితులకు త్వరగా పరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాటు పరిహారం ఇవ్వడంలో జాప్యం జరిగితే ఆ బాధ్యతను లీగల్ సర్వీస్ అథారిటీకి అప్పగిస్తామని కూడా కోర్టు తెలిపింది. ఈ అంశంపై సొలిసిటర్ జనరల్‌తో కూర్చొని ప్రక్రియను సులభతరం చేయాలని కూడా కోర్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

Vladimir Putin: భారత్ రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. కీలకం కానున్న రష్యా-భారత్ ద్వైపాక్షిక చర్చలు

Mental Health: మీ వ్యవహార శైలిలో ఈ మార్పులు కనిపిస్తుంటే మీ మానసిక ఆరోగ్యం పాడైనట్టే..వెంటనే నిపుణులను సంప్రదించాల్సిందే!

Sensex: వారాంతంలో మదుపర్లకు బిగ్ షాక్.. భారీగా పడిపోయిన సెన్సెక్స్.. కారణాలు ఇవే..