Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Putin-Modi: భారత్ రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. కీలకం కానున్న రష్యా-భారత్ ద్వైపాక్షిక చర్చలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 6న భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 21వ వార్షిక సమావేశం కూడా జరగనుంది.

Putin-Modi: భారత్ రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. కీలకం కానున్న రష్యా-భారత్ ద్వైపాక్షిక చర్చలు
Putin And Modi
Follow us
KVD Varma

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 26, 2021 | 9:35 PM

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 6న భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 21వ వార్షిక సమావేశం కూడా జరగనుంది. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక చర్చల తేదీలను కూడా ప్రకటించారు. ఈ విషయాన్ని రష్యా రాయబార కార్యాలయం ధృవీకరించింది. పుతిన్‌ ఎప్పుడు భారత్‌లో పర్యటిస్తారనే దానిపై చాలా రోజులుగా ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఈ పర్యటనపై ఇరు దేశాలు స్పష్టం చేయలేదు. భారత్‌, అమెరికాల మధ్య ఈ నెలలో కీలక చర్చలు జరగడమే ఇందుకు కారణమని భావించారు. అయితే, ఇప్పుడు రష్యాతో చర్చల గురించి అధికారిక ప్రకటన వెలువడింది.

రక్షణ..విదేశీ వ్యవహారాల మంత్రి కూడా..

రష్యా రాయబార కార్యాలయాన్ని ఉటంకిస్తూ పుతిన్ పర్యటన.. ద్వైపాక్షిక చర్చల గురించి వార్తా సంస్థ సమాచారం ఇచ్చింది. దీని ప్రకారం డిసెంబర్ 6న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, రక్షణ మంత్రి సెర్గీ షోగుయ్ భారత్‌కు వస్తున్నారు. అదే రోజు పుతిన్ కూడా న్యూఢిల్లీ చేరుకోనున్నారు. లావ్‌రోవ్, షోగుయ్ ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కానున్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీతో పుతిన్ భేటీ కానున్నారు.

ముఖ్యమైన అంశాలు చర్చల్లో..

రష్యన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో ఈ ద్వైపాక్షిక చర్చలు చాలా ముఖ్యమైనవని తెలిపింది. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరగనున్నాయి. హిందూ మహాసముద్రం, ఆఫ్ఘనిస్థాన్, సిరియా వంటి ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO), రష్యా-భారత్-చైనా (RIC) గురించి కూడా ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. చాలా విషయాల్లో భారతదేశం, రష్యా మధ్య ఒప్పందం-సహకారం ఉంది. కానీ చైనా విషయంలో, రెండు దేశాల మధ్య మరిన్ని చర్చలు అవసరం.

రష్యాకు ప్రాధాన్యత

ఇక ద్వైపాక్షిక చర్చల విషయానికొస్తే, ప్రత్యేక మిత్రదేశాలతో ఈ సంప్రదాయాన్ని ప్రారంభించింది భారతదేశం. రష్యాతో పాటు భారత్ మూడు దేశాలతో మాత్రమే ద్వైపాక్షిక చర్చలు జరుపుతోంది. ఆ దేశాలు అమెరికా, జపాన్ అలాగే ఆస్ట్రేలియా.

మోదీ, పుతిన్‌ల మధ్య జరిగే చర్చల్లో రక్షణ, వాణిజ్యంపై కూడా ముఖ్యమైన ఒప్పందాలు కుదరవచ్చు. ఇది కాకుండా, ఇద్దరు నాయకులు పెట్టుబడి, శాస్త్ర సాంకేతికతపై కూడా మాట్లాడవచ్చు. గతేడాది ద్వైపాక్షిక సమావేశం జరగలేదు. కోవిడ్ కారణంగా ఇది రద్దు అయింది.

ఇవి కూడా చదవండి: Mental Health: మీ వ్యవహార శైలిలో ఈ మార్పులు కనిపిస్తుంటే మీ మానసిక ఆరోగ్యం పాడైనట్టే..వెంటనే నిపుణులను సంప్రదించాల్సిందే!

Sensex: వారాంతంలో మదుపర్లకు బిగ్ షాక్.. భారీగా పడిపోయిన సెన్సెక్స్.. కారణాలు ఇవే..

Mumbai Attacks: ముంబయిపై ముష్కర దాడికి 13 ఏళ్ళు.. ఇప్పటికీ ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన ఆ ఘటన ఎలా జరిగిందంటే..