CLAT Exam: లా విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఏటా రెండుసార్లు క్లాట్‌.. కౌన్సెలింగ్‌ ఫీజు కూడా తగ్గింపు.. (వీడియో)

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Nov 27, 2021 | 8:16 AM

న్యాయవాద విద్యను అభ్యసించాలనుకునేవారికి శుభవార్త. దేశంలోని న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది నుంచి ఏటా రెండుసార్లు కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) నిర్వహించనున్నారు. ఈ మేరకు కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (CNLU)...


న్యాయవాద విద్యను అభ్యసించాలనుకునేవారికి శుభవార్త. దేశంలోని న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది నుంచి ఏటా రెండుసార్లు కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) నిర్వహించనున్నారు. ఈ మేరకు కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (CNLU) ఉత్తర్వులు జారీచేసింది. వీటి ప్రకారం CLAT- 2022 మొదటి దశ మే 8న, రెండో దశ పరీక్ష డిసెంబర్ 18న జరగనుంది. పరీక్షలు ఆఫ్‌లైన్‌లోనే అంటే పేపర్‌- పెన్‌ మోడ్‌లో జరగనున్నాయి. విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కౌన్సెలింగ్‌ ఫీజును కూడా CNLU తగ్గించింది. జనరల్‌ విద్యార్థులకు రూ.50 వేల నుంచి రూ.30 వేలకు ఫీజు తగ్గించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్య్యూడీ వంటి రిజర్వ్‌డ్‌ కేటగిరీ విద్యార్థులు రూ.20 వేలు కడితే సరిపోతుంది.

‘దేశంలో చాలా ప్రవేశ పరీక్షలు మే- జూన్ నెలల్లోనే జరుగుతాయి. దీంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. చాలా తేదీలు క్లాష్ అవుతాయి. ఫలితంగా విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు డిసెంబర్‌లోనే క్లాట్‌ను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. 2019 నుంచి దీనిపై చర్చలు జరుగుతున్నాయి. మొదట జనవరిలో క్లాట్ పరీక్ష నిర్వహించాలని అనుకున్నాం.. కానీ అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతమైన మంచుకురుస్తుంది. ఇది కాకుండా, చాలా చోట్ల 12వ తరగతి ప్రీ బోర్డ్ పరీక్షలు నిర్వహిస్తారు. అందుకే డిసెంబర్‌లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్ లా వీసీ ఫ్రొఫెసర్‌ ఫైజాన్‌ ముస్తఫా వెల్లడించారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu