Terrorists: మాల్దీవుల మాజీ అధ్యక్షుడిపై ఉగ్రవాదుల బాంబు దాడి..ఆందోళన వ్యక్తం చేసిన భారత్
Maldives ex president attacked: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ నషీద్ బాంబు పేలుడులో గాయపడ్డారు.
Terrorists: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ నషీద్ బాంబు పేలుడులో గాయపడ్డారు. తన ఇంటి నుంచి బయటకు వచ్చి నషీద్ కారులో కూర్చున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో, కారు సమీపంలో భారీ పేలుడు సంభవించింది. నషీద్ తలకు, కడుపుకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, భద్రతా సంస్థలు దీనిని ఉగ్రవాద దాడిగా భావిస్తున్నారు.
నషీద్‌పై దాడిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఈ ఘటన పట్ల తాము మేము ఆందోళన చెందుతున్నామనీ, నషీద్ త్వరలో కోలుకుంటారని ఆశిస్తున్నామనీ తెలిపారు.
పేలుడు భారీగా ఉందని చెబుతున్నారు. ‘అల్ జజీరా’ వెబ్‌సైట్ ప్రకారం, నషీద్ కారు సమీపంలో పేలుడు చాలా పెద్దది. పేలుడులో నషీద్ అంగరక్షకులలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. నషీద్‌ను వెంటనే రాజధాని నగరం మాలేలోని అతిపెద్ద ఆసుపత్రిలో చేర్చారు. కొద్దిరోజుల క్రితం అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద సంస్థలు తమ దేశంలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నాయని, కొంతమంది స్థానిక ప్రజల మద్దతు తమకు లభిస్తోందని నషీద్ చెప్పారు.
నషీద్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్, మాల్దీవులు చాలా బలమైన సంబంధాలను కలిగి ఉండేవి. తరువాత ఇతర పార్టీలు అధికారంలోకి వచ్చి చైనా వైపు మొగ్గు చూపడం ప్రారంభించాయి.
విదేశాంగ మంత్రి మాట్లాడుతూ- ఈ ఉగ్రవాద కుట్ర సంఘటన తరువాత , మాల్దీవుల రాజధానిలో భద్రతా దళాలను అప్రమత్తం చేశామన్నారు. విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ మాట్లాడుతూ – నషీద్ ఇంటి బయట పేలుడు సంభవించింది. ఇందులో ఆయన గాయపడ్డారు. ప్రస్తుతానికి, ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. నేను ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వలేను. ఇది ఉగ్రవాద దాడి అనడంలో సందేహం లేదు. మా భద్రతా సంస్థలు దీనిపై దర్యాప్తు చేస్తున్నాయి అన్నారు. ఈ దారుణమైన దాడి చేసిన నేరస్థులను పట్టుకుంటామని ప్రకటించారు.
దర్యాప్తు సంస్థ అధికారి ఒకరు మాట్లాడుతూ ”ప్రాధమికంగా, ఇది ఐఇడి పేలుడు అనిపిస్తుంది. ఇది రిమోట్ నుండి నియంత్రింఛి జరిపిన దాడి. నషీద్ కారు సమీపంలో బైక్‌లో ఈ బాంబ్ ను ఏర్పాటు చేశారు.” అని తెలిపారు.
పెళ్లి ప్రపోజల్ తిరస్కరించినందుకు బ్రిటిష్ యువతిని కాల్చి చంపారు, పాకిస్తాన్ లో దారుణం