AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పటికే ఆమె తల్లి… ప్రేమించిన వ్యక్తి కోసం మరోసారి పెళ్లిపీటలు ఎక్కనున్న న్యూజీలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌

New Zealand's PM Wedding: న్యూజీలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఆమెకు ఈ వయసులో పెళ్లి గౌనులో కనిపించడం ఇబ్బంది ఉంటుంది అని అనుకుంటున్నారు. కనుక పెళ్లి ముస్తాబులు...

ఇప్పటికే ఆమె తల్లి... ప్రేమించిన వ్యక్తి కోసం మరోసారి పెళ్లిపీటలు ఎక్కనున్న న్యూజీలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌
New Zealand's Pm Wedding (1)
Sanjay Kasula
|

Updated on: May 07, 2021 | 5:56 AM

Share

న్యూజీలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఆమెకు ఈ వయసులో పెళ్లి గౌనులో కనిపించడం ఇబ్బంది ఉంటుంది అని అనుకుంటున్నారు. కనుక పెళ్లి ముస్తాబులు ఏమీ ఉండవు అని ఆమె ప్రకటించారు. జసిండాకు రెండేళ్ల కూతురు ఉంది. ఇప్పుడామె తన బాయ్‌ ఫ్రెండ్, బిడ్డ తండ్రి అయిన వ్యక్తినే వివాహమాడబోతున్నారు. జూన్‌ 21 న్యూజీలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ కూతురు నీవ్‌ తియారహ మూడో పుట్టిన రోజు కూడా కావడం విశేషం.  ఈ తల్లికూతుళ్లతో కలిసి వెల్లింగ్టన్‌లోని అధికార నివాసం ప్రీమియర్‌ హౌస్‌లో క్లార్క్‌ గేఫోర్డ్‌ అనే వ్యక్తి కూడా ఉంటారు.

వచ్చే సమ్మర్‌లో జసిండా, క్లార్‌ పెళ్లి చేసుకోబోతున్నారు. న్యూజీలాండ్‌లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వేసవి నెలలు. ఆ మూడు నెలల్లో ఏదో ఒక రోజు క్లార్క్‌.. ఇంటి సభ్యుడు అనే హోదా నుంచి జెసిండా భర్త హోదా పొందబోతున్నారు. పెళ్లి తేదీ ఫిక్స్‌ అయింది. అయితే పెళ్లికి పిలవకపోయినా నొచ్చుకోని ఆత్మీయులు ఎవరైతే ఉంటారో ఆ జాబితాను తయారు చేశాక మాత్రమే పెళ్లి తేదీని బహిర్గతం చేస్తామని కోస్ట్‌ రేడియో ప్రతినిధితో జసిండా అన్నట్లు న్యూజీలాండ్‌ హెరాల్డ్‌ పత్రిక వెల్లడించింది.

రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న పెళ్లి  వీరిది. 2019 ఈస్టర్‌ సెలవుల్లోనే జసిండా, క్లార్క్‌ల నిశ్చితార్థం జరిగింది. నిజానికి నిశ్చితార్థం కూడా వాయిదా పడుతూ వస్తోంది. 2017 అంతా జసిండా బిజీ. ఆ ఏడాదే, జసిండా తన ముప్పై ఆరేళ్ల వయసులో న్యూజీలాండ్‌ ప్రధాని అయ్యారు. ఆ దేశానికి అతి చిన్న వయసులో ప్రధాని అయిన తొలి మహిళగా జసిండా రికార్డు నమోదు చేశారు. తర్వాత 2018 అంతా బిజీ… ప్రధాని బాధ్యతలతో పాటు తల్లి బాధ్యతల్నీ నెరవేర్చడం… బిడ్డ పుట్టాక ఇదంతా చూసుకున్నారు. నిశ్చితార్థం జరిగినా, పెళ్లి వరకు రావడానికి మళ్లీ ఒక ఆటంకం… కరోనా కట్టడిలో జసిండా బిజీ అయిపోయారు. దేశంలోని యాభై లక్షల మంది జనాభాను కరోనా నుంచి కాపాడేందుకు క్షణం తీరిక లేకుండా పనిచేశారు.

2012లో తొలిసారి జసిండా, క్లార్క్‌ ఒకరికొకరు పరిచయం అయ్యారు. అప్పుడామె లేబర్‌ పార్టీ తరఫున పార్లమెంట్‌ సభ్యురాలిగా ఉన్నారు. పరిచయం తర్వాత కొన్నాళ్లకు క్లార్క్‌ జసిండాను కలిశారు. వివాదాస్పద గవర్నమెంట్‌ కమ్యూనికేషన్స్‌ సెక్యూరిటీ బ్యూరో బిల్‌ గురించి వివరాల కోసం వచ్చారు. మీడియా ప్రతినిధి కావడంతో  స్టోరీ పని మీద అయుండొచ్చు. అక్కడే వాళ్ల స్నేహం మొదలైంది.

ఆమె ఫెమినిస్టు. ఆయన హ్యూమనిస్టు. స్థూలంగా ఇద్దరూ ఒకటే. ఏడేళ్ల స్నేహం తర్వాత 2019లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటన నేటికీ నెరవేరలేదు. ఇప్పుడు మళ్లీ జూన్‌ 21న పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ సమయానికి కోవిడ్ వ్యాప్తికి అనుకూలంగా వీరి వివాహం ఉండే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి: Aadhar Card: ఆధార్ మిస్ యూజ్ అవుతుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్నారా? మీ కార్డును ఇలా లాక్ చేసుకోండి..

ఏపీ విద్యార్థుల‌కు జ‌గన్ స‌ర్కార్ గుడ్ న్యూస్.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్

Follow Us