పెళ్లి ప్రపోజల్ తిరస్కరించినందుకు బ్రిటిష్ యువతిని కాల్చి చంపారు, పాకిస్తాన్ లో దారుణం

తమ పెళ్లి ప్రపోజల్ ను తిరస్కరించినందుకు పాతికేళ్ల మహిళను ఇద్దరు యువకులు కాల్చి చంపారు. పాక్ లో పుట్టి బ్రిటన్ లో స్థిర పడిన మైరా జుల్ఫికర్ అనే ఈ యువతి ఇటీవల పాకిస్తాన్ లోని లాహోర్ కు వచ్చింది.

పెళ్లి ప్రపోజల్ తిరస్కరించినందుకు బ్రిటిష్ యువతిని కాల్చి చంపారు, పాకిస్తాన్ లో దారుణం
British Woman Strangled Shot Dead In Pakistan
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 06, 2021 | 8:31 PM

తమ పెళ్లి ప్రపోజల్ ను తిరస్కరించినందుకు పాతికేళ్ల మహిళను ఇద్దరు యువకులు కాల్చి చంపారు. పాక్ లో పుట్టి బ్రిటన్ లో స్థిర పడిన మైరా జుల్ఫికర్ అనే ఈ యువతి ఇటీవల పాకిస్తాన్ లోని లాహోర్ కు వచ్చింది. అయితే మూడు నెలల క్రితం ఈమె బెల్జియం నుంచి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. లాహోర్ లోని తన స్నేహితురాలితో మైరా ఓ అద్దె ఇంట్లో ఉంటూ వచ్చిందని, ఈమె స్నేహితుడు సాద్ అమీర్ బట్ ఈమెను పెళ్లి చేసుకుంటానని చెప్పగా మైరా తిరస్కరించిందని వారు వెల్లడించారు. ఇదే సమయంలో జాహిద్ జానూన్ అనే మరో యువకుడు కూడా మైరాను పెళ్లికోసం బలవంతం చేశాడని, కానీ ఇతని కోర్కెను కూడా ఆమె తిరస్కరించిందని తెలిసింది. దీంతో ఈమెపై కక్ష గట్టిన వీరిద్దరూ నిన్ను అంతం చేస్తామని హెచ్చరించారట. కానీ వారి బెదిరింపులను మైరా ఖాతరు చేయకపోవడంతో ఇద్దరూ ఆమె గొంతు నులిమి.. కసి తీరక గన్ తో కాల్చి చంపారని తెలిసింది. ఆమె మెడపైన, చేతిపైన బుల్లెట్ గాయాలున్నట్టు పోస్ట్ మార్టం రిపోర్టులో తెలిసింది.

బ్రిటన్ లోని మిడిల్సెక్స్ యూనివర్సిటీ నుంచి లా పట్టా అందుకున్న మైరా జుల్ఫికర్ ఇలా ఇద్దరు కర్కోటకుల చేతిలో హతమైంది. ఈ కేసులో పోలీసులు నిందితులను ఇంకా అరెస్టు చేయలేదు. మైరా బంధువులు స్పష్టంగా నిందితుల పేర్లు చెబుతున్నా .. వారి ఆచూకీ తెలియజేసినా పోలీసులు ఎందుకో జాప్యం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Corona Variants: కరోనా వైరస్‌ రూపాంతరాలు… 3నెలలకో కొత్త రకం! 14నెలల్లో 4 వైరస్‌లు!!

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులు బంద్‌.. ముందస్తు రిజర్వేషన్ సేవలు రద్దు.. కారణాలు ఇలా ఉన్నాయి..?