Chinese Rocket: మానవాళి మీద చైనా కక్ష కట్టిందా.. మనుషులను అంతం చేయడమే డ్రాగన్ కం(త్రీ)ట్రీ లక్ష్యమా..!

చైనా ఇటీవల కాలంలో చేస్తున్న ప్రతి చర్య మానవాళి వినాశనానికే అన్నట్టు చేస్తోంది. ప్రపంచమంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న కోవిడ్ 19ని తయారు చేసింది చైనా లాబరెటరీల్లో అన్నది అందరికి తెలిసిన వాస్తవమే.

  • Updated On - 8:27 pm, Thu, 6 May 21 Edited By: Balaraju Goud
Chinese Rocket: మానవాళి మీద చైనా కక్ష కట్టిందా.. మనుషులను అంతం చేయడమే డ్రాగన్ కం(త్రీ)ట్రీ లక్ష్యమా..!
An ‘out Of Control’ Chinese Rocket Is Expected To Crash

‘Out-of-control’ Chinese rocket: చైనా ఇటీవల కాలంలో చేస్తున్న ప్రతి చర్య మానవాళి వినాశనానికే అన్నట్టు చేస్తోంది. ప్రపంచమంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న కోవిడ్ 19ని తయారు చేసింది చైనా లాబరెటరీల్లో అన్నది అందరికి తెలిసిన వాస్తవమే. కోవిడ్ వ్యాప్తి అది చేస్తున్న అరాచకం దశల వారీగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ అది చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ గొడవ నుంచి ఇంకా తేరుకోక ముందే, ఇప్పడు తాజా చైనా మరో దుర్మార్గమైన పని చేసింది.

అప్పుడెవప్పుడో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు స్కై ల్యాబ్ గురించి ముందు తరం వాళ్లు వినే ఉంటారు. ఇప్పుడు అలాంటిదే భూమి మీదకి దూసుకువస్తోంది. చైనా ప్రయోగించిన ఒక రాకెట్ విఫలమై అది భూమి మీదకి దూసుకువస్తోంది. సహజంగా ఇలాంటి రాకెట్లు కూలిపోయే సందర్భంలో అది సమద్రంలోనే పడేలా దానిని డిజైన్ చేస్తారు. కానీ, చైనా చేసిన ఈ పని వల్ల ఈ 21 టన్నుల బరువైన అతి భారీ రాకెట్ భూమి మీద పడడమే కాదు, జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా అది పడేఅవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

నాసా తాజాగా అందిస్తున్న వివరాల ప్రకారం.. అది భూమిని చేరడానికి ఒక అరగంట ముందు మాత్రమే అది ఏ ప్రాంతంలో కూలే అవకాశం ఉందో చెప్పగలం, కానీ, ముందస్తుగా చెప్పలేమని ప్రస్తుతానికి అది పూర్తిగా అదుపుతప్పిన రాకెట్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 8వ తేదీకి అది భూమిని తాకే అవకాశం ఉందని మాత్రం స్పష్టమవుతోంది.

ఈ రాకెట్, కోవిడ్ 19 వైరస్ మాత్రమే కాదు. అంతకు ముందు కూడా చైనా ఇలాంటి అనేక దుందుడుకు పనులు చేసిన చరిత్ర ఉంది. ప్రపంచంలోనే FAST పేరుతో 500 మీటర్ల విస్తీర్ణం కల్గిన అతి పెద్ద రేడియో సిగ్నల్ టెలిస్కోపిక్ డిష్ ని చైనా తయారు చేసింది. దీనికి సాంకేతిక అవసరాల కోసం వినియోగిస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ, చైనా విశ్వంలో ఎక్కడో మన సౌర మండలం అవతల ఎక్కడన్నా ఏలియన్స్ ఉంటే వాటికి సిగ్నల్ పంపిచే ప్రయత్నం ఈ FAST ద్వారా చేస్తోంది. మన మానవాళి కంటే ఎన్నో రెట్లు సాంకేతికంగా ముందంజలో ఉన్న ఏలియన్స్‌కి ఇలా సిగ్నల్స్ పంపించి భూమి ఉనికిని వాటికి తెలియజేయడం, తెలియని శత్రువుని ఆహ్వానం పంపడమే అన్నది శాస్త్రవేత్తల వాదన.

Stephen hawking లాంటి శాస్త్రవేత్తలు కూడా బతికున్న రోజుల్లోనే చైనా ఈ దూకుడు చర్యని తప్పబట్టారు. ఇది ఖచ్చితంగా సూసైడల్ మిషన్ అవుతుందని, ఒక వేళ ఎక్కడో విశ్వంలో ఏదో ఒక చోట ఉన్న ఏలియన్స్ ఈ సిగ్నల్ ఆధారంగా భూమి మీద దాడికి దిగితే దానిని తట్టుకునే శక్తి మానవాళికి ఉండదని హాకింగ్స్ హెచ్చరించారు. అయినా, చైనా మాత్రం తన ప్రయత్నాల్ని కొనసాగిస్తూనే ఉంది.

ఇలా ప్రతి సందర్భంలో చైనా చేస్తున్న పనులు చివరికి మానవాళి ఉనికినే ప్రశ్నార్ధకంగా మారుస్తాయా.. మానవ జాతి వినాశనం, ఈ భూగోళ అంతం చైనా చర్యల వల్లే జరుగుతుందా అన్నదే నిపుణులకి కలుగుతున్న అనుమానం. కానీ, చైనాకున్న అన్ని రకాల ఆయుధ సంపత్తిని ఆలోచించి అగ్ర రాజ్యమని చెప్పుకునే అమెరికా తోసహా అందరూ చైనా దుశ్చర్యల్ని ఆపే ప్రయత్నం మాత్రం చేయడం లేదు.

—  మురళీ కృష్ట, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, టీవీ 9.

Read Also…  ఎలుగుబంటితో ఎన్నికల ప్రచారం, వావ్ ! అమెరికాలో ఆ అభ్యర్థి భలే ఐడియా అదిరింది. !