ఎలుగుబంటితో ఎన్నికల ప్రచారం, వావ్ ! అమెరికాలో ఆ అభ్యర్థి భలే ఐడియా అదిరింది. !
బుర్రలో ఆలోచనలు ఉండాలేగానీ అవి ఎలాంటి పనులకైనా ప్రేరేపిస్తాయి. ఎవరూ ఊహించనివి కూడా చూస్తాం..వింటాం.. ఇప్పుడు అమెరికా లోని కాలిఫోర్నియా విషయానికే వద్దాం !
బుర్రలో ఆలోచనలు ఉండాలేగానీ అవి ఎలాంటి పనులకైనా ప్రేరేపిస్తాయి. ఎవరూ ఊహించనివి కూడా చూస్తాం..వింటాం.. ఇప్పుడు అమెరికా లోని కాలిఫోర్నియా విషయానికే వద్దాం ! అక్కడ రాష్ర గవర్నర్ పదవికి జరిగే ఎన్నికలో పోటీ చేసే రిపబ్లికన్ అభ్యర్థి ఒకరు భలే ఐడియా వేశారు. జాన్ కాక్స్ అనే ఈ పెద్దమనిషి ‘బ్యూటీ అండ్ ది బీస్ట్’ పేరిట వినూత్న ప్రచారం ప్రారంభించాడు. ఈయన చేసే ప్రచారంలో 500 కేజీల బరువున్న ఓ భారీ ఎలుగుబంటి ప్రత్యేక ఆకర్షణ అవుతోంది.దీన్ని తన వెంటే తిప్పుతున్నాడు. ‘బ్యూటీ’ అంటే ఇక్కడ ప్రస్తుతమున్న డెమొక్రాట్ గవర్నర్ గవిన్ న్యూసమ్ అని, ‘బీస్ట్’ అంటే తానేనని ఈయన సెటైరికల్ గా చెబుతున్నాడు. గవిన్ ‘అదో తరహా మనిషి’ అని, అతని అపియరెన్స్ ‘అదోలా’ ఉంటుందని కాక్స్ వింత ప్రచారం చేస్తున్నాడు.తనను కాలిఫోర్నియా గవర్నర్ పదవికి ఎన్నుకుంటే రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని, పన్నులను తగ్గిస్తానని, భారీ మార్పులు చేస్తానని ఈయన హామీలు గుప్పిస్తున్నాడు. నా ప్రచార పోస్టర్లలో ఈ ఎలుగుబంటి ఫోటో కూడా ఉంటుందని కాక్స్ చెబుతున్నాడు. అన్నట్టు ‘టాగ్ ‘అనే ఈ ఎలుగుబంటి కథ ఒకటుంది. దీన్ని చిన్నప్పుడే ట్రెయినర్లు ఎక్కడి నుంచో తీసుకువచ్చి బాగా శిక్షణ ఇచ్చారట దీంతో మనుషులకు మాలిమి అయింది. కొన్ని సినిమాలు, టీవీ సీరీస్ లో కూడా దీన్ని వినియోగించుకున్నారట. కాక్స్ మాట్లాడుతున్నప్పుడు ఈ ఎలుగు ట్రెయినర్లు ఇచ్చిన బిస్కెట్లు తింటూ కనిపించింది. అయితే రాజకీయ ప్రచారాల్లో ఇలా జంతువులను వినియోగించుకోరాదని జంతు కారుణ్య సంస్థ ‘పెటా’ అంటోంది. ఇది క్రూరత్వమే అవుతుందని ఆరోపిస్తోంది. కాలిఫోర్నియాలో కరోనా వైరస్ ని అదుపు చేయడంలో ప్రస్తుత గవర్నర్ విఫలమయ్యాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ పదవికి ఈ సంవత్సరాంతంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ గవర్నర్ ని ఎన్నుకోవాలంటే ఇదివరకటి 12శాతం ఓటర్ల సంతకాలతో బాటు రెఫరెండం కూడా నిర్వహిస్త్తారు. 2003 లో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ షెవర్జ్ నెగర్ ఇలా ఎన్నికయ్యాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: రాత్రిళ్లు భక్తుల ప్రాణాలను తీసే అమ్మవారి ఆలయం.. నైట్ అయితే చాలు భయంతో పారిపోతున్న జనం.. ఆ గుడి ఎక్కడుందంటే..
700 టన్నుల ఆక్సిజన్ ఇస్తారా? కోవిడ్ మరణాలు సంభవించకుండా చూస్తాం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్