Murali Krishna

Murali Krishna

Executive Editor - TV9 Telugu

muralikrishna.m@tv9.com

పుట్టింది జర్నలిస్ట్ కుటుంబంలో కావడంతో చిన్నప్పటి నుంచే న్యూస్ అంటే ఆసక్తి. అందుకేనేమో 1992లో ఇంటర్మీడియట్ తర్వాత సెలవల్లోనే ఉదయం పత్రికకి స్ట్రింగర్ గా పని చేయడం మొదలు పెట్టాను. తర్వాత ఆంధ్రభూమి లో కొంత కాలం ఫుల్ టైమర్గా రిపోర్టింగ్ ఉన్నాను. చదువు కొనసాగిస్తూనే 1995 సిటీ కేబుల్ లో చేరడం ద్వారా ఎలట్రానిక్ మీడియాలోకి ప్రవేశించాను. ఆ తర్వాత 1999 నుంచి 2003 వరకూ ఈ టి.వి.లో పని చేయడం ఒక మంచి స్కూల్ లో చేరినట్టు అయ్యింది. అలా సాగిన ప్రస్తానం 2003లో టి.వి.9 (తెలుగులోనే మొట్ట మొదటి 24 గంటల న్యూస్ ఛానల్) లో చేరడం ద్వారా మలుపు తిరిగింది. పొలిటికల్, క్రైం వార్తల కవరేజ్ లో భాగంగా దేశ, విదేశాల్లో ఎక్కడ ఏం జరిగినా అక్కడకి వెంటనే వెళ్ళిపోవడం రిపోర్టింగ్ చేయడం మంచి అనుభవాల్ని మిగిల్చింది. ఇక యాంకర్ గా సి.ఎం. వై.ఎస్. రాజశేఖరరెడ్డితో చేసిన “మిస్టర్ ఛీప్ మినిస్టర్” ప్రోగ్రాం, దాదాపు 500 ఎపిసోడ్ లకు పైగా చేసిన “ఎన్కౌంటర్ విత్ మురళీ కృష్ణ” ప్రోగ్రాంతోపాటు ఉదయాన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్ని విశ్లేషించే “న్యూస్ వాచ్” ప్రోగ్రామ్ లు మంచి గుర్తింపుని ఇచ్చాయి. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ప్రస్తుతం చేస్తున్న “వీకెండ్ అవర్ విత్ మురళీకృష్ణ” ప్రోగ్రామ్ తోపాటు ఇన్ పుట్ హెడ్ గా టీమ్ ని లీడ్ చేయడం ఒక ముఖ్యమైన బాధ్యతగా భావిస్తున్నా.

Read More
Follow On:
Hyderabad: ఆకాశంలో అద్భుతం దృశ్యం.. సూర్యాస్తమయ సమయంలో కనువిందు చేసిన ఇంద్రధనస్సు

Hyderabad: ఆకాశంలో అద్భుతం దృశ్యం.. సూర్యాస్తమయ సమయంలో కనువిందు చేసిన ఇంద్రధనస్సు

శనివారం (జులై 8) సాయంత్రం హైదరాబాద్‌లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యస్తమయ సమయంలో ఇంధ్ర ధనస్సు ఏర్పడింది. ఇది నగరవాసులను కనువిందు చేసింది.