AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shark Attack: తెల్ల సొరచేప దాడిలో కాలు కోల్పోయిన సర్ఫింగ్ క్రీడాకారుడు.. దానికి గుర్తుగా ఏం సాధించాడో తెలుసా?

Surfer Chris Blowes: కొంతమంది కోరికలు విచిత్రంగా ఉంటాయి. అందులోనూ సాహస క్రీడలు చేసేవారి తీరు మరీ గమ్మత్తుగా ఉంటుంది. వేటకు వెళ్ళిన వాళ్ళు పులి లాంటి జంతువును చంపితే ఆ జంతువు చర్మం ఇంటిలో పెట్టుకునే వారు పూర్వం.

Shark Attack: తెల్ల సొరచేప దాడిలో కాలు కోల్పోయిన సర్ఫింగ్ క్రీడాకారుడు.. దానికి గుర్తుగా ఏం సాధించాడో తెలుసా?
Surfer Chris Blowes
KVD Varma
|

Updated on: May 07, 2021 | 10:38 AM

Share

Shark Attack: కొంతమంది కోరికలు విచిత్రంగా ఉంటాయి. అందులోనూ సాహస క్రీడలు చేసేవారి తీరు మరీ గమ్మత్తుగా ఉంటుంది. వేటకు వెళ్ళిన వాళ్ళు పులి లాంటి జంతువును చంపితే ఆ జంతువు చర్మం ఇంటిలో పెట్టుకునే వారు పూర్వం. ఇప్పుడు ఆ అవకాశం లేదు లెండి. వేట అనే పదానికే చట్టబద్ధత లేదు కదా. అయితే, సర్ఫింగ్ క్రీడలో తన మీద దాడిచేసిన ఒక సొరచేప దంతాన్ని తన సర్ఫ్ బోర్డులో ఉంచుకోవడానికి పోరాడి మరీ హక్కు సాధించుకున్నాడు ఓ సాహస క్రీడాకారుడు. దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్ 2015 లో సర్ఫింగ్ కోసం సముద్రంలోకి వెళ్ళాడు. అక్కడ అతనిని ఒక షార్క్ తీవ్రంగా గాయపరించింది. దాదాపుగా పదిరోజుల పాటు అతను కోమాలో ఉండిపోయాడు. కొమాలోంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి అతను ఒకటే కోరికతో నిలబడ్డాడు.

ఏప్రిల్ 2015 లో, క్రిస్ ఫిషరీ బే వద్ద సర్ఫింగ్ చేస్తున్నప్పుడు, 5.5 మీటర్ల పెద్ద తెల్ల సొరచేప అతని వెనుక నుండి దూసుకెళ్లింది. దాంతో పాటు అతనిపై దాడికి దిగింది. ఈ దాడిలో అతని కాలు పూర్తిగా విచ్చిన్నం అయిపోయింది. అపస్మారకస్థితిలో ఉన్న క్రిస్ ను అతని స్నేహితులు రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. అడిలైడ్ కు తరలించి ఆసుపత్రిలో చేర్పించారు. దాదాపు 10 రోజుల పాటు అతను కోమాలోనే ఉన్నాడు. గుండె పనిచేయడం మానేసింది. చివరకు వైద్యుల సహాయంతో అతను బతికి బట్టకట్టాడు.

తరువాత, ఛిద్రమైపోయిన అతని కాలు తొలగించారు. ఇక అతను సర్ఫింగ్ కు వెళ్ళిన బోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రిస్ కోలుకున్న తరువాత ఆ బోటును తెచ్చుకోవడానికి పోలీసుల వద్దకు వెళ్ళాడు. బోటు తీసుకున్న తరువాత పరిశీలిస్తే..దానిలో ఆ తెల్ల సొరచేప దంతం ఒకటి ఇరుక్కుపోయి కనిపించింది. దక్షిణ ఆస్ట్రేలియా చట్టం ప్రకారం, ఆ దంతాన్ని అధికారులకు అప్పగించారు. అక్కడి రాష్ట్ర మత్స్య నిర్వహణ చట్టం ప్రకారం, తెల్ల సొరచేపల యొక్క ఏదైనా భాగాన్ని కలిగి ఉండటం, అమ్మడం లేదా కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం. అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 100,000 డాలర్లు (రూ .57.04 లక్షలు) లేదా రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. అయితే, క్రిస్ మాత్రం ఆ దంతం తనకు కావాలని అనుకున్నాడు. దానికోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తరువాత ఆ దంతాన్ని చూడటానికి కూడా అధికారులు అతన్ని సమ్మతించలేదు. అయినా, క్రిస్ పట్టువదల లేదు. ఎవరేం చెప్పినా వినలేదు. నాకు ఆ దంతం కావలసిందే. నా సర్ఫ్ బోర్డు పై పెట్టుకోవాల్సిందే అంటూ మొండికేశాడు.

ఎన్నో ప్రయత్నాల తరువాత, అతని పట్టుదల చూసి..అతను చెప్పిన కారణం విని ఒక స్థానిక రాజకీయ నాయకుడు అతనికి ఆ చట్టం నుంచి మినహాయింపు ఇప్పించి.. ఆ దంతాన్ని సావనీర్ గా ఉపయోగించుకునేందుకు అనుమతి ఇప్పించారు. ఇంతకీ క్రిస్ ఆ రాజకీయ నాయకునికి చెప్పిన కారణం ఏమిటో అతని మాటల్లోనే..”ఇది నా బోర్డులో చిక్కుకుంది, దాని పంటి కోసం నేను ఎప్పుడూ ఒక సొరచేపను చంపను, కాని అది నా కాలు తీసుకుంది, నేను నాకాలును తిరిగి పొందలేను. అలాగని ఆ షార్క్ ను మళ్ళీ చూడనూ లేను. అలాగే, షార్క్ దాని పంటిని తిరిగి పొందడం లేదు నేను నా కాలు తిరిగి పొందడం లేదు, ” అందుకే ఆ గుర్తుగా నా సర్ఫింగ్ బోర్డ్ కు ఆ దంతాన్ని తగిలించుకుంటాను”.

Also Read: Terrorists: మాల్దీవుల మాజీ అధ్యక్షుడిపై ఉగ్రవాదుల బాంబు దాడి..ఆందోళన వ్యక్తం చేసిన భారత్

PM Jacinda Ardern: పెళ్లిపీటలు ఎక్కనున్న న్యూజీలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌… ( వీడియో )