Acrobatic Pole Dancer: అంగ వైకల్యాన్ని జయించి పోల్ డ్యాన్సర్ గా గోల్డ్ మెడల్ సాధించిన యువతి

Acrobatic Pole Dancer: కొంతమంది అన్ని అవయవాలు ఉండి అవకాశాలు లేవంటూ ఎదుటివారిమీద నిందలు వేస్తూ.. కాలం గడిపేస్తారు. అయితే మరికొందరు పుట్టుకతో..

Acrobatic Pole Dancer: అంగ వైకల్యాన్ని జయించి పోల్ డ్యాన్సర్ గా గోల్డ్ మెడల్ సాధించిన యువతి
Acrobatic Pole Dancer
Follow us
Surya Kala

|

Updated on: Dec 13, 2021 | 10:11 AM

Acrobatic Pole Dancer: కొంతమంది అన్ని అవయవాలు ఉండి అవకాశాలు లేవంటూ ఎదుటివారిమీద నిందలు వేస్తూ.. కాలం గడిపేస్తారు. అయితే మరికొందరు పుట్టుకతో అవయాలు లేకపోయినా అంగవైకల్యాన్ని మనోధైర్యంతో ఎదుర్కొంటూ జీవితంలో తమ కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు చేతులు, ఒక కాలు లేకుండా పుట్టిన ఓ అమ్మాయి.. ఇప్పుడు పోల్ డ్యాన్సర్ గా అందరిని ఆకట్టుకుంది. ఇటలీకి చెందిన ఈ యువతి తాను కన్న కలలు నిజం చేసుకుని చరిత్ర సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..

పెరుగియాకు చెందిన‌ 15 ఏళ్ల ఫ్రాన్సెస్కా సెసార‌నికి పుట్టుకతోనే ఒక కాలు, రెండు చేతులు లేదు. దీంతో తాను ఏ పని చేసుకోవాలన్నా తల్లిదండ్రుల మీద ఆధారపడేది.  కనీసం ఆకలి వేస్తె కూడా ఆహారం తినాలంటే ఎవరొకరు తినిపించాల్సిందే. అయితే సెసార‌నికి అక్రోబాటిస్ పోల్ డ్యాన్సర్ గా పేరు తెచ్చుకోవాలని కోరిక. అయితే పోల్ డ్యాన్సర్ గా చేయడానికి కాళ్ళు చేతులు లేకపోడం అడ్డంకాదని నిరూపించడానికి కష్టపడింది. ఎందుకంటే పోల్ డ్యాన్స్ చేస్తూ విన్యాసాలు చేయ‌డం నార్మల్ పర్సన్ కే కొంచెం కష్టం. మరి చేతులు కాలు లేని సెసార‌నికి ఈ పోల్ డ్యాన్స్ ఇంకా కష్టం.. కూతురు కోరిక విన్నప్పుడు ఆమె తల్లి షాక్ తింది. ఐతే చిన్నతనం నుంచి కృతిమ కాలు పెట్టుకుని ఫ్రాన్సెస్కా పోల్ డ్యాన్సింగ్‌లో శిక్షణ పొందింది. ఇప్పుడు అందరూ గర్వించదగిన పోల్ డ్యాన్సర్ గా పేరు తెచ్చుకుంది.

2021 లో ఇంట‌ర్నేష‌నల్ పోల్ స్పోర్ట్స్ ఫెడ‌రేష‌న్‌లో వ‌ర్చువ‌ల్ వ‌ర‌ల్డ్ పోల్..  ఏరియ‌ల్ చాంపియ‌న్‌షిప్‌లో ఫ్రాన్సెస్కా పాల్గొంది. కరోనా వైరస్ వలన పోల్ డ్యాన్సర్లు తమ తమ పోల్ డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలను వర్చువల్  గా ఫ్రాన్సెస్కా జడ్జీలకు పంపించింది. అంగ వైక‌ల్యం కేట‌గిరీలో ఫ్రాన్సెస్కా గోల్డ్ మెడ‌ల్‌ను సాధించింది.

తన కూతురు సాధించిన విజయంపై తండ్రి మార్కో స్పందిస్తూ.. తనకూతురుకి జీవితంలో ఏమి కావాలి, ఏమి సాధించాలనే విషయంపై ఓ క్లారిటీ ఉందని చెప్పారు. అందుకే.. త‌న ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు మేము ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటామని తెలిపారు.

Also Read:  మిస్ యూనివర్స్‌గా హర్నాజ్‌ కౌర్‌ ఎంపిక.. మూడోసారి భారత్‌కు ఈ కిరీటాన్ని అందించిన పంజాబీ భామ..