Miss Universe 2021: మిస్ యూనివర్స్‌గా హర్నాజ్ కౌర్.. మూడోసారి భారత్‌కు ఈ కిరీటాన్ని అందించిన పంజాబీ భామ..
Miss Universe 2021: ఇజ్రాయెల్ లో జరిగిరిన మిస్ యూనివర్స్ .. 2021 పోటీల్లో ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్ని హర్నాజ్ కౌర్ సంధు సొంతం..
Miss Universe 2021: ఇజ్రాయెల్ లో జరిగిన మిస్ యూనివర్స్ – 2021 పోటీల్లో ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారత్‌కు చెందిన హర్నాజ్ కౌర్ సంధు సొంతం చేసుకుంది. ఈ కిరీటం కోసం ఫైనల్లో అందాల భామ దివా మిస్ పరాగ్వే మిస్ సౌత్ ఆఫ్రికాతో తలపడింది. చివరకు ఆధిక్యాన్ని సంపాదించి ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. మరోసారి భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటాన్ని సాధించిపెట్టిన ఈ పంజాబీ అందాల భాహ.. యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచింది. పరాగ్వేకు చెందిన నదియా ఫెరీరా ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా.. దక్షిణాఫ్రికాకు చెందిన లాలెలా మస్వానే రెండో రన్నరప్‌గా నిలిచారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన బీట్రైస్ గోమెజ్ ఈ పోటీలో టాప్ 5లో నిలిచింది.
హర్నాజ్ కి కిరీటాన్ని అందించడానికి అడిగిన ప్రశ్న వాతావరణ మార్పు ఒక బూటకమని అంటుంటారు.. మీ సమాధానం ఏమిటి అని అడిగితే.. హర్నాజ్ సమాధానం చెబుతూ.. ప్రకృతిలో చాలా సమస్యలున్నాయని తెలిసి…తన గుండె పగిలిపోతోందన్నారు. ఇదంతా బాధ్యతారాహిత్యం వల్లే జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మనం చేసే ప్రతి చర్య ప్రకృతిని రక్షించగలదని సమాధానం చెప్పింది. అనంతరం విశ్వసుందరిగా ఆమె పేరు చెప్పగానే ఆనందంతో కన్నీళ్లు కార్చారు హర్నాజ్. 70వ మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో ఈ టైటిల్‌ను గెలుచుకున్న భారతదేశపు మూడవ బ్యూటీ హర్నాజ్ కౌర్ సంధు. అయితే ఈ 21 ఏళ్ల బ్యూటీ జర్నీ అంత ఈజీగా సాగలేదు.. ఎన్నో హేళనలు ఎదుర్కొంది. స్కూల్ లో తోటి విద్యార్థులు తనపై వేసే జోక్స్ ని భరిస్తూ.. తనని తాను నిరూపించుకోవానికి చేసిన జర్నీలో విజయమే నేటి.. మిస్ యూనివర్స్ కిరీటం..
చిన్నతనంలో సన్నగా గాలొస్తే ఎగిరిపోయెలా ఉండడంతో.. తోటివారు చేసే హేళనకు భరించింది. సిగ్గుతో తలదించుకుని ఒంటిగా గడపడానికి అలవాటైన హర్నాజ్ కు కుటుంబం మద్దతుగా నిలిచింది. తర్వాత మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. మరోవైపు సినిమాల్లో నటిస్తూనే అందాల పోటీల్లో పాల్గొని.. ఇప్పుడు ఏకంగా భారత్ కు మూడో మిస్ యూనివర్స్ కిరీటాన్నీ అందించింది.
భారత్ తరపున గతంలో మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా నుంచి సుస్మితా సేన్, లారా దత్తా, సెలీనా జైట్లీ, నేహా దుపియా పోటీపడ్డారు. అయితే 1994లో సుస్మితాసేన్, 2000లో లారా దత్తా మాత్రమే మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది దాదాపు 80 మంది పోటీదారులతో పోటీపడి మూడోసారి హర్నాజ్ కౌర్ సింధు సొంతం చేసుకున్నారు.
చంఢీఘర్‌లోని పంజాబీ కుటుంబంలో 2000 సంవత్సరంలో హర్నాజ్ కౌర్ సంధు జన్మించింది. శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పట్టాపుచ్చుకుంది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. హర్నాజ్ చిన్నప్పటి నుంచి ఫిట్‌నెస్ లవర్. గుర్రపు స్వారీ, ఈత, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్‌ను అమితంగా ఇష్టపడుతుంది.
కాలేజీలో తొలి స్టేజ్ ప్రదర్శనతో తన మోడలింగ్ లో జర్నీ మొదలు పెట్టింది. 17 ఏళ్లకే మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. అనంతరం అందాల పోటీల్లో పాల్గొని 2017లో ‘మిస్ చంఢీఘర్’ కిరీటాన్ని గెలుచుకుంది. 2019లో ‘మిస్ ఇండియా’ టైటిల్ కోసం పోటీ పడి టాప్ 12 జాబితాలో నిలిచింది.
View this post on Instagram