Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: అస్తికలతో ఆభరణాలు.. ఆంతర్యం ఏంటో తెలిస్తే అదుర్స్ అంటారు..!

Viral News: ఇంతవరకు మనం వెండి, బంగారం, డైమాండ్‌ వంటి వాటితో తయారు చేసిన ఆభరణాలు చూశాం...ఇంకా ఖరీదైనవి కావాలంటే....ప్లాటినం నగలు కూడా ఉపయోగిస్తుంటారు.

Viral News: అస్తికలతో ఆభరణాలు.. ఆంతర్యం ఏంటో తెలిస్తే అదుర్స్ అంటారు..!
Jewelry
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 13, 2021 | 9:01 AM

Viral News: ఇంతవరకు మనం వెండి, బంగారం, డైమాండ్‌ వంటి వాటితో తయారు చేసిన ఆభరణాలు చూశాం…ఇంకా ఖరీదైనవి కావాలంటే….ప్లాటినం నగలు కూడా ఉపయోగిస్తుంటారు. కానీ, ఇప్పుడు అస్తికలతో తయారు చేసిన ఆభరణాలకు ఫుల్‌ డిమాండ్‌ పెరుగుతోంది. వామ్మో అస్తికలతో ఆభరణాలా..? అని అవాక్కయ్యారా.. కానీ, ఇది నిజమేనండోయ్. దాని వెనుక ఆంతర్యం తెలిస్తే మీరు కూడా సూపర్ అంటారు.

న్యూయార్క్‌లోని మార్గరెట్ క్రాస్ అనే సంస్థ చనిపోయిన వారి అవశేషాలతో రింగ్, బ్రాస్‌లెట్, చైన్ ఇలా నగలు తయారు చేస్తోంది. మామూలు ఆభరణాల మాదిరి కాకుండా వీటిని చనిపోయిన వారి పళ్లు, జుట్టు, గోళ్లు, అస్తికలతో తయారు చేస్తారు. అయితే, ఇలాంటి ఆభరణాలేంటి అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. కానీ ఈ ఆభరణాల కాన్సెప్ట్ వెనుక ఉన్న అసలు కారణం తెలిసి ఫిదా అవుతున్నారు. ఎవరైనా ఆత్మీయులు, కుటుంబ సభ్యులు చనిపోతే వారికి గుర్తుగా ఏదో ఒక వస్తువు మన దగ్గర ఉంచుకోవడం పరిపాటే. ఇందులో భాగంగానే ఇప్పుడు చనిపోయిన వారి అవశేషాలతో ఆభరణాలు తయారు చేయిస్తున్నారు. వాటిని ధరిస్తూ మరణించినవారు తమతోనే ఉన్నట్లు భావిస్తున్నారు. మరణించిన వారి జుట్టును ఉంగరాల్లో భద్ర పరచి వారి ఆత్మ తమతోనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు.

అయితే దీనిని వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. కానీ లవ్ అండ్ లాస్ అనే ఈ కాన్సెప్ట్ చాలా మంది ప్రజలకు బాగా నచ్చుతోంది. అందుకే ఇది బాగా క్రేజ్ తెచ్చుకుంటోంది. రింగ్, బ్రాస్‌లెట్, చైన్ ఇలా చనిపోయిన వారి అవశేషాలతో వివిధ రకాల నగలు తయారు చేస్తోంది మార్గరెట్ క్రాస్ అనే సంస్థ. ఈ ఆభరణాలలో ఎక్కువగా జుట్టు, పళ్లు, గోళ్లు, వినియోగిస్తున్నారు. అయితే వీటి ధరలు చాలా ఎక్కువేనట. ఎందుకంటే.. మనిషి అవశేషాలను ఆభరణాలుగా తీర్చిదిద్దేందుకు శ్రమతోపాటు చాలా టైం పడుతుందని చెబుతున్నారు.

Also read:

Area 51: విమానం హైజాక్ చేస్తున్నా.. ఏలియన్స్‌ చూసేందుకు వెళ్తున్నా.. అమెరికాలో వింత సంఘటన..!

Shocking: 200 మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్.. ఇతను ఒకప్పుడు పోలీస్.. షాకింగ్ రీజన్

Infinix: ఇండియాలో ఈరోజు 2 స్మార్ట్‌ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?