Shocking: 200 మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్… ఇతను ఒకప్పుడు పోలీస్.. షాకింగ్ రీజన్

క్షణికావేశంతో నేరాలు చేసేవారు.. ఆ తర్వాతి కాలంతో చేసిన తప్పుల పట్ల రిగ్రెట్ ఫీల్ అవుతారు. కానీ మానసిక వ్యాధితో నేరాలు చేసేవాళ్లు మాత్రం చాలా డేంజరస్.

Shocking: 200 మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్... ఇతను ఒకప్పుడు పోలీస్.. షాకింగ్ రీజన్
Dangerous Serial Killer
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 13, 2021 | 11:38 AM

క్షణికావేశంతో నేరాలు చేసేవారు.. ఆ తర్వాతి కాలంతో చేసిన తప్పుల పట్ల రిగ్రెట్ ఫీల్ అవుతారు. కానీ మానసిక వ్యాధితో నేరాలు చేసేవాళ్లు మాత్రం చాలా డేంజరస్. సీరియల్ కిల్లర్స్ ఈ కేవకే చెందుతారు. వీరిలో పశ్చాతాపం ఉండదు. తన మనసులోని భావాలు, ఆలోచనలకు అనుగుణంగా వీరు అమాయకుల ప్రాణాలు తీస్తారు. ఒక డేంజరస్ సీరియల్ కిల్లర్ గురించి ఈ రోజు మీకు చెప్పబోతున్నాం. ఈ వ్యక్తి రష్యాలోని జైలులో ఉన్నాడు. అయితే ఇతడు ఒకప్పుడు పోలీస్ అన్న విషయం తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. ఈ కిల్లర్ పేరు మిఖాయిల్ పాప్కోవ్. ఇతను 200 మందికి పైగా మహిళలను దారుణంగా చంపాడని ఆరోపణలు ఉన్నాయి. డైలీస్టార్ వెబ్‌సైట్ మిఖాయిల్‌ను ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన కిల్లర్ అని పేర్కొంది. మహిళల హత్యల వెనుక అతను చెప్పిన కారణం చాలా షాకింగ్‌గా ఉందని వివరించింది. మిఖాయిల్ తనకు మహిళలపై తీవ్రమైన ద్వేషం ఉందని విచారణలో చెప్పాడట. హత్యకు ముందు ఈ కిల్లర్ మహిళలను మాటలలో వర్ణించలేని విధంగా దారుణంగా హింసించేవాడట.

మహిళలు ప్రాణాలు తీయడానికి ఇతడు సుత్తిని ఉపమోగించాడు. దానితో మోది వారి ప్రాణాలు తీసేవాడు. మహిళలను చంపే ముందు వారిపై అత్యాచారం చేసేవాడు. చంపిన అనంతరం శరీరాన్ని ముక్కలు చేసేవాడు. మృతుల శరీర భాగాలకు పోస్ట్‌మార్టం చేసిన నిపుణులు హంతకుడిని తోడేలుగా అభివర్ణించారు. మిఖాయిల్ పోలీసు కావడంతో ఎవరికీ అతడిపై అనుమానం రాలేదు. అయితే నేరస్థుడు ఎంత తెలివైన వాడైనా నేరం చేసిన తర్వాత కొన్ని ఆధారాలను వదిలివేస్తాడు. మిఖాయిల్ విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఒక రుజువు అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. జీవిత ఖైదు విధించిన తర్వాత కూడా, మిఖాయిల్ తన చర్యలకు పశ్చాత్తాపపడలేదు. అతను ఇప్పటికే 22 మంది మహిళలను హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. మరికొన్ని కేసుల్లో విచారణ సాగుతోంది. ఎందుకు ఇన్ని హత్యలు చేశావని మిఖాయిల్‌ను అడిగితే.. నేను చెత్తను శుభ్రం చేస్తున్నానని చెప్పాడట.

Also Read: ప్రభాస్‌ ఇష్యూ మానసికంగా ట్రబుల్‌ చేసింది.. కీలక కామెంట్స్ చేసిన నిత్యామీనన్

రూ.270తో లాటరీ టికెట్ కొన్న డ్రైవర్.. కొద్దిగంటల్లోనే దిమ్మతిరిగే వార్త.. అమ్మిన వ్యక్తి కూడా షాక్