Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Area 51: విమానం హైజాక్ చేస్తున్నా.. ఏలియన్స్‌ చూసేందుకు వెళ్తున్నా.. అమెరికాలో వింత సంఘటన..!

Area 51: గ్రహాంతర వాసులు, ఏలియన్స్ ఉన్నారో లేదో ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు గానీ.. జనాలలో మాత్రం ఏలియన్స్‌కి సంబంధించి ఆసక్తి విపరీతంగా పెరిగిపోతుంది.

Area 51: విమానం హైజాక్ చేస్తున్నా.. ఏలియన్స్‌ చూసేందుకు వెళ్తున్నా.. అమెరికాలో వింత సంఘటన..!
Area 51
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 13, 2021 | 8:58 AM

Area 51: గ్రహాంతర వాసులు, ఏలియన్స్ ఉన్నారో లేదో ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు గానీ.. జనాలలో మాత్రం ఏలియన్స్‌కి సంబంధించి ఆసక్తి విపరీతంగా పెరిగిపోతుంది. ఏలియన్స్ గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉరకలేస్తుంది. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు నిత్యం ప్రకటించే సైంటిఫిక్ అంశాలు, ఏలియన్స్‌కు సంబంధించిన సిగ్నల్స్, యూఎఫ్ఓ గురించి సమాచారం, వార్తలు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా దాని ప్రభావం చేతనో.. మరేమో గానీ.. ఓ వ్యక్తి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ షాకింగ్ ప్రకటన చేశాడు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి.. నానా రచ్చ చేశాడు. ఆఖరికి కటకటాల వెనక్కి వెళ్లాడు.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. అమెరికాకు చెందిన మాథ్యూ హాన్‌కాక్.. లాస్ వేగాస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చొరబడ్డాడు. అంతటితో ఆగకుండా.. గ్రహాంతర వాసులు ఉండే ప్రాంతంగా పేరొందిన ‘ఏరియా 51’ కి వెళ్లేందుకు విమానాన్ని హైజాక్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఏలియన్స్‌ని చూసేందుకే తాను వెళ్తున్నానని అన్నాడు. ఈ మేరకు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చాడు. నకిలీ బాంబుతో విమానాశ్రయ భద్రతా సిబ్బందిని హడలెత్తించాడు. షాట్ గన్, గ్యాసోలిన్ వంటి ఆయుధాలతో అందరినీ బెంబేలెత్తించాడు. అతని చర్యకు అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది.. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి మాథ్యూ హాన్‌కాక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు. అతని మానసిక పరిస్థితి సరిగా లేదని అక్కడి అధికారులు అంచనాకు వచ్చారు. ఏదేమైనా.. ఇతని చర్య కారణంగా.. అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులను కాసేపు హడలెత్తించాడు.

Also read:

Pushpa MASSive Pre Release Highlights: మొదలైన ఐకాన్ స్టార్ పుష్పరాజ్ సందడి’లో హైలెట్స్ …(వీడియో)

Top 9 News: తెలుగు రాష్ట్రాల ట్రెండింగ్ వార్తలు.. పొలిటికల్ న్యూస్ సమాహారం “టాప్ 9 న్యూస్” (వీడియో)

Pushpa: పుష్ప రిలీజ్ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్ అల్లువారి వారసులు.. తగ్గేదే లే.. అంటూ అతిధులతో క్లాప్స్ కొట్టించిన అర్హ, అయాన్